NTV Telugu Site icon

Mukesh Ambani: నేడు మరోసారి ముఖేష్ అంబానీకి హత్య బెదిరింపు.. ఈ సారి ఏకంగా రూ.200కోట్లు డిమాండ్

Mukhesh Ambani

Mukhesh Ambani

Mukesh Ambani: దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆ కంపె చైర్మన్, బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి వరుసగా రెండో రోజు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి. ఈసారి కూడా అతనికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. అది మునుపటి ఈ-మెయిల్ ఐడి నుండి పంపబడింది. ఈసారి తన ప్రాణాలను కాపాడినందుకు ప్రతిఫలంగా ముఖేష్ అంబానీ నుండి 200 కోట్ల రూపాయలను డిమాండ్ చేసినట్లు ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు, ముఖేష్ అంబానీని షార్ప్ షూటర్‌తో కాల్చివేస్తానని శుక్రవారం సాయంత్రం తనకు ఇ-మెయిల్ వచ్చిందని ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ పోలీసులకు సమాచారం అందించాడు. రూ.20 కోట్ల ఇవ్వకపోతే చంపేస్తామన్నారు. విషయం తీవ్రతను అర్థం చేసుకున్న గాందేవి పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ఇప్పుడు మరోసారి అదే ఈ-మెయిల్ ఐడీ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. అక్టోబర్ 27న ముకేశ్ అంబానీకి మొదటి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. భారత్‌లో అత్యుత్తమ షార్ప్ షూటర్లు అతని వద్ద ఉన్నారని ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. ప్రాణం కాపాడుకోవాలంటే రూ.20 కోట్లు ఇవ్వాలని అందులో ఉంది. ఆ తర్వాత, సెక్యూరిటీ ఇన్‌చార్జి సమాచారం మేరకు, ముంబై పోలీసులు ఐపీసీ పీనల్ కోడ్ సెక్షన్ 387, 506 (2) కింద గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

Read Also:Haryana: హెచ్‎ఆర్ హెడ్‎గా నటిస్తూ సాలరీ అకౌంట్ ఓపెన్ చేసి రూ.2కోట్లు కొట్టేశాడు

రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో ముకేశ్ అంబానీకి ముగ్గురు పిల్లలను చేర్చేందుకు షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపిన రోజే ఈ బెదిరింపు మెయిల్ రావడం గమనార్హం. అదే రోజున కంపెనీ జూలై-సెప్టెంబర్ ఫలితాలను ప్రకటించింది. ఇందులో ముఖేష్ అంబానీ కంపెనీ రూ.19,878 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ముఖేష్ అంబానీ లేదా అతని కుటుంబానికి హత్య బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది అక్టోబరు 5న రిలయన్స్‌ ఫౌండేషన్‌కు చెందిన ఓ ఆసుపత్రికి ఫోన్‌ చేసి అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఆసుపత్రిని బాంబుతో పేల్చివేయనున్నట్లు పేర్కొన్నాడు. అయితే, ఆ వ్యక్తిని మరుసటి రోజు బీహార్ నుండి అరెస్టు చేశారు. అతన్ని రాకేష్ కుమార్ శర్మగా గుర్తించారు. ఇది మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ముఖేష్ అంబానీ ఇంటి యాంటిలియా వెలుపల పేలుడు పదార్థాలతో నిండిన వాహనం కనుగొనబడిన వార్త కూడా ప్రజల దృష్టిని ఆకర్షించింది.

Read Also:Israel-Hamas War: మెట్రో సొరంగాల వెబ్‌లో హమాస్ తీవ్రవాదులు.. ఇజ్రాయిల్ కు సవాల్

Show comments