మన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. విలాసవంతమైన జీవితం గడిపే అంబానీ ఫ్యామిలీ.. తమ వారికి అందించే కానుకల్లో ఏమాత్రం వెనకాడరని చాలా సందర్భాల్లో నిరూపించారు. ఇప్పుడు తమకు కాబోయే కోడలికి వివాహ కానుకలుగా కోట్లు విలువైన వస్తువులను పంపారు.. పెళ్లి ముందే ఇన్ని పంపారు ఇక పెళ్లికి ఎన్ని పంపిస్తారో.. పెళ్లి ఏ రేంజులో ఉంటుందో అని జనాలు దీనిపై గుసగుసలు చెప్తున్నారు..
ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. వీరి వివాహం మరి కొద్ది రోజుల్లోనే జరగనుందని తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలైన క్రమంలో తమకు కాబోయే కోడలు రాధికా మర్చంట్ కు అంబానీ కుటుంబం కోట్లు విలువ చేసే లగ్జరీ గిఫ్ట్స్ అందించినట్లుతెలుస్తుంది.. అందులో రూ.4.5 కోట్లు విలువైన బెంట్లీ కారు, వెండి లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నక్లెస్ వంటి ఖరీదైన గిఫ్ట్ లను ఇచ్చారు..
ఇక నీతా అంబానీ కూడా తన కాబోయే కోడలికోసం వెండి లక్ష్మీ గణపతి గిఫ్ట్ హ్యాంపర్ అందించినట్లు తెలుస్తోంది. ఈ గిఫ్ట్ లో రెండు సిల్వర్ తులసి పాట్స్, ఒక సిల్వర్ స్టిక్ స్టాండ్, ఒక లక్ష్మీ గణపతి విగ్రహం ఉన్నాయి. తెల్లటి పూలు, ఇతర నగలతో కలిపి ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఉంది. మరోవైపు.. రాధికాకు వారి ఎంగేజ్‌మెంట్ డే సందర్భంగా ముకేశ్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ అందించారు. రూ.4.5 కోట్లు విలువైన బెంట్లీ కారు ఇచ్చినట్లు తెలుస్తోంది.. అంబానీ మేనకోడలు, ఇషేతా సల్గావోకర్ కాక్‌టెయిల్ పార్టీకి రాధికా మర్చంట్ అద్భుతమైన ముత్యాలు, వజ్రాల హారంలో కనిపించారు. ఆ నెక్లెస్ తనకు కాబోయే అత్తగారు నీతా అంబానికి చెందినదిగా సమాచారం. వివాహ కానుకగా తన డైమండ్ చౌకర్‌ను రాధికా మర్చంట్‌కి నీతా అంబానీ అందించినట్లు తెలుస్తోంది.. ఇలా పెళ్లికి ఇంకా ఖరీదైన గిఫ్ట్ లను తన కోడలికి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.. ఇవన్నీ విన్న తర్వాత అందరూ షాక్ అవుతున్నారు.. ఎంతైనా డబ్బులుంటే అంతే.. అంబానీ అంటే ఆ మాత్రం ఉండాలిగా అని నెటిజన్లు అంటున్నారు..
