Mudragada Padmanabha Reddy: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంను కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇక ఆసుపత్రిలో కిడ్నీకి సంబంధించి డయాలసిస్ ట్రీట్మెంట్ అందించారు డాక్టర్లు. అయినా మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ తీసుకుని వెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే, హైదరాబాద్ వెళ్లే ముందు ఒకసారి ఇంటికి వెళ్లాలని ఉందని కిర్లంపూడి తీసుకుని వెళ్లాలని పద్మనాభం కోరారు. దాంతో కాకినాడ నుంచి కిర్లంపూడి కూడా తీసుకుని వెళ్లారు. ఇంటిదగ్గర కొద్దీ నిమిషాల పాటు ఉన్న ముద్రగడను అభిమానులు, సన్నిహితులు ఇంటికి చేరుకుని తిరిగి ఆరోగ్యంగా రావాలని ఆకాంక్షించారు. అయితే మొదట ఎయిర్ అంబులెన్స్ ద్వారా షిఫ్ట్ చేయాలని భావించినప్పటికీ, ముద్రగడ మాత్రం అందుకు అంగీకరించలేదు. దాంతో రోడ్డు మార్గం ద్వారా అంబులెన్స్ లో హైదరాబాద్ తరలించారు.
Vizag Online Betting: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం.. ప్రధాన బుకీ గోపి అరెస్ట్..!
ఇక ఎన్టీవీతో ముద్రగడకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ రాజా అమరేంద్ర (నెఫ్రాలజిస్ట్) మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం కిడ్నీ వాపుతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని, అందుకు సంబంధించి డయాలసిస్ ట్రీట్మెంట్ అందించామన్నారు. యూరిన్ కి సంబంధించి కూడా ఇబ్బంది ఉందని, ప్రస్తుతానికి ఆయన కోలుకున్నారని తెలిపారు. క్యాన్సర్ కి సంబంధించి ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ జరగలేదని, రెగ్యులర్ గా చెకప్ చేయించుకునే హాస్పిటల్ కి వెళ్తామని అనడంతో డిశ్చార్జ్ చేశామన్నారు.
