NTV Telugu Site icon

MS Dhoni: ఏంటీ స్టంపింగ్ భయ్యా.. చిరుత వేగం

Dhoni

Dhoni

చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2025లో వికెట్ల వెనుక చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ధోని చిరుతపులి వేగంతో ఫిల్ సాల్ట్‌ను స్టంప్ చేసి సీఎస్కేకు కీలకమైన బ్రేక్ అందించాడు. ఆర్సీబీ ఓపెనర్ బ్యాట్స్‌మన్ ఫిల్ సాల్ట్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఐదో ఓవర్లో స్పిన్నర్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్ కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో క్రీజు బయటకు వచ్చి ఆడుదామనుకున్న సాల్ట్‌ను.. ఎంఎస్ ధోని మెరుపు వేగంతో వికెట్లను గిరాటేశాడు. ఫీల్డ్ అంపైర్ ధోని అప్పీలుపై థర్డ్ అంపైర్‌ను సంప్రదించగా, రీప్లేలో స్పష్టంగా ఫిల్ సాల్ట్ క్రీజు బయట ఉన్నట్లు కనబడింది. దీంతో.. సాల్ట్ పెవిలియన్ కు వెళ్లక తప్పలేదు. 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు.

Read Also: RamCharan : ఉత్తరాంధ్ర స్లాంగ్ తో రామ్ చరణ్‌.. మళ్లీ అదే సెంటిమెంట్..

ధోని తన కెరీర్‌లో ఎన్నో మెరుపు స్టంపింగ్‌లు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్ 2025 సీజన్‌లో కూడా అతను ఇప్పటికే రెండుసార్లు బ్యాట్స్‌మెన్లను స్టంపౌట్ చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ఇదే విధంగా స్టంప్ చేసి ఆందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు మంచి ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా ధోని లాంటి అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ మద్దతుగా ఉండటం సీఎస్కే జట్టుకు మరింత బలాన్నిచ్చింది. ధోని వికెట్ల వెనుక వేగం, చురుకుదనం ప్రత్యర్థి జట్లకు ఎప్పటికీ తలనొప్పిగానే ఉంటుంది.

Read Also: L2: Empuraan: మోహన్ లాల్ ‘ఎంపురాన్’’‌తో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం..