Site icon NTV Telugu

MS Dhoni: ముంబై ఇండియన్స్ జెర్సీలో ధోని.. అసలేం జరుగుతోంది?

Dhoni

Dhoni

MS Dhoni: మాజీ టీమిండియా కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం ఎంఎస్ ధోని ముంబై ఇండియన్స్ (MI) శిక్షణ జెర్సీలో కనిపించి అభిమానులను షాక్ గురి చేశారు. వ్యాపారవేత్త అర్జున్ వైద్య తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలో ధోని ఒక ఫుట్‌బాల్ మైదానం దగ్గర కొందరితో కలిసి MI శిక్షణ జెర్సీ ధరించి పోజులిచ్చారు. ఇక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముఖ్యంగా CSK వీర అభిమానులు ఆశ్చర్యానికి లోనవ్వగా, MI అభిమానులు తమ జట్టు జెర్సీని ధోని ఆఫ్-ఫీల్డ్‌లో ధరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Himachal Bus Landslide: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరం.. బస్సుపై కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి

క్రికెట్‌తో పాటు బైక్‌ల పట్ల తనకున్న ఇష్టాన్ని బహిరంగంగా తెలిపిన ధోని.. తాజాగా ఆయన అధికారికంగా గరుడ ఏరోస్పేస్ నుండి డ్రోన్ పైలట్ లైసెన్స్ పొందారు. కఠినమైన శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ధోని, ఇప్పుడు డ్రోన్‌లను నడపడానికి సర్టిఫికేషన్ పొందారు. ఈ విషయాన్ని ధోని స్వయంగా ఫేస్‌బుక్‌లో ప్రకటిస్తూ.. “గరుడ ఏరోస్పేస్‌తో నా DGCA డ్రోన్ పైలట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది” అని రాసుకొచ్చారు.

11 Nations Warn Trump: అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చిన 11 దేశాలు!

గరుడ ఏరోస్పేస్ అనేది DGCA ఆమోదం పొందిన రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (RPTO). ఇది ఇప్పటివరకు 2,500 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చింది. తమ బ్రాండ్ అంబాసిడర్ ఈ ప్రోగ్రామ్‌ను పూర్తి చేయడంపై గరుడ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు, CEO అగ్నిశ్వర్ జయప్రకాష్ సంతోషం వ్యక్తం చేశారు. మా బ్రాండ్ అంబాసిడర్, పెట్టుబడిదారు ఎంఎస్ ధోని వ్యక్తిగతంగా శిక్షణ పొంది, పైలట్‌గా సర్టిఫికేషన్ పొందడం మాకు ఒక కిలక మైలురాయి అని తెలిపారు. ఆయన చాలా త్వరగా నేర్చుకున్నారని.. నేర్చుకోవడంపై బాగా దృష్టి పెట్టారని జయప్రకాష్ అన్నారు. ఇకపోతే తన క్రికెట్ కెరీర్‌తో పాటు ధోని వివిధ రంగాలలో కూడా అడుగుపెట్టారు. తన తాజా మైలురాయితో పాటు ‘కెప్టెన్ కూల్’ 2011లో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను కూడా అందుకున్నారు.

Exit mobile version