NTV Telugu Site icon

The GOAT-MS Dhoni: విజయ్ ‘ది గోట్’లో ఎంఎంస్‌ ధోనీ.. దద్దరిల్లిపోయిన థియేటర్లు!

The Goat Ms Dhoni

The Goat Ms Dhoni

MS Dhoni special appearance in Vijay’s The GOAT: కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘ది గోట్’ (గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌ టైమ్‌). వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, స్నేహ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ది గోట్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం ఉదయం 4 గంటలకే షోలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో తమిళనాడు వ్యాప్తంగా.. ముఖ్యంగా చెన్నైలో దళపతి విజయ్ ఫాన్స్ సందడి చేస్తున్నారు.

ది గోట్ మూవీలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ కనిపించడంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఒకేసారి ధోనీ-విజయ్‌లను చూసి అరుపులు, కేకలతో ఫాన్స్ నానా హంగామా చేశారు. ఓ సీన్‌లో మహీ బ్యాటింగ్‌కు వెళ్తూ కనిపించగా.. విజయ్ బైక్‌పై వెళ్తూ కనిపించారు. ఈ సీన్‌కు ధోనీ-విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు ధోనీ ఆడుతున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఆయనను ఫాన్స్ ‘తలా’ అని ముద్దుగా పిలుచుకుంటారు.

తమిళగ వెట్రి కజగం రాజకీయ పార్టీని విజయ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఎన్నికలకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఇదే చివరి చిత్రం అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఐపీఎల్ 2024లో ఆడిన ఎంఎస్ ధోనీ.. 2025లో ఆడుతాడో లేదో ఇంకా తెలియరాలేదు. మహీ ఆడాలనే ఫాన్స్ కోరుకుంటున్నారు.

Show comments