MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!
- మహేంద్ర సింగ్ ధోని AI స్టార్టప్ ‘కుకు’లో పెట్టుబడి
- కుకు టీవీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని ఎంపిక
- పెట్టుబడి ఆర్థిక వివరాలు వెల్లడించని సంస్థ
- 2018లో స్థాపించబడిన కుకు సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Invests: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మొబైల్ స్టోరీటెల్లింగ్ ప్లాట్ ఫామ్ అయిన ‘కుకు’ (Kuku) లో ధోని భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ పెట్టుబడితో పాటు.. కుకు సంస్థకు చెందిన మైక్రో డ్రామా యాప్ ‘కుకు టీవీ’ (Kuku TV) కి ధోని బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించనున్నారు. అయితే ఈ పెట్టుబడికి సంబంధించిన ఆర్థిక వివరాలను సంస్థ వెల్లడించలేదు.
IPL 2026: కోహ్లీ, రోహిత్ ల మధ్య తేడా అదే.. రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు..!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. చిన్న పట్టణాల నుండి వచ్చిన వ్యవస్థాపకులు ఇంతటి స్థాయికి ఎదగడం నాకు చాలా గర్వంగా ఉంది. భారత్ కోసం, భారత్ నుండి ప్రపంచ స్థాయికి ఎదిగే ఏఐ ఆధారిత ప్లాట్ ఫామ్ ను నిర్మించాలనే వారి దార్శనికతపై నాకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. 2018లో లాల్ చంద్ బిసు, వికాస్ గోయల్, వినోద్ కుమార్ మీనాలు స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం కుకు టీవీ (మైక్రో డ్రామాలు), కుకు ఎఫ్ఎమ్ (ఆడియో స్టోరీస్) వంటి వివిధ యాప్ లను నిర్వహిస్తోంది.
భారతదేశంలో ప్రస్తుతం మైక్రో డ్రామా (చిన్న నిడివి గల నాటకాలు) మార్కెట్ లో శరవేగంగా దూసుకుపోతున్నాయి. 2025 నాటికి ఈ మార్కెట్ విలువ 300 మిలియన్ డాలర్లు దాటగా, 2026 చివరి నాటికి ఇది 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కుకు సంస్థ ఇప్పటికే 350 మిలియన్లకు పైగా ఇన్ స్టాల్ లను కలిగి ఉంది. ఇది మొత్తం 7 భాషల్లో 20 వేలకు పైగా టైటిల్స్ తో ఈ ప్లాట్ ఫామ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవలే ఈ సంస్థ ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జాంబీస్’ (IIZ) అనే హిందీ చిత్రంతో థియేట్రికల్ రంగంలోకి కూడా ప్రవేశించింది.
Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..!
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్టార్టప్, అక్టోబర్ 2025లో గ్రానైట్ ఆసియా నేతృత్వంలో సుమారు 85 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ధోని వంటి లెజండ్ వ్యక్తి తోడవడంతో సంస్థ మరింత బలోపేతం అవుతుందని కుకు వ్యవస్థాపకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలోనే ఈ సంస్థ మైథో-ఫాంటసీ, సూపర్ హీరో కథాంశాలతో కూడిన ఏఐ ఒరిజినల్ మైక్రో డ్రామాలను విడుదల చేసి మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!