Site icon NTV Telugu

MS Dhoni : ధోని అరుదైన రికార్డ్.. ఆ సిక్సర్ పడిన చోటునే విక్టరీ మెమోరియల్‌గా మార్చిన ఎంసీఎ

Md Dhoni Wanked

Md Dhoni Wanked

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్( ఎంసీఎ ) ధోనిని సగర్వంగా సత్కరించింది. 2011లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో భారత్ ఆడిన ఫైనల్స్ లో ధోని విన్సింగ్ షాట్ కొట్టిన విషయం అందరికి తెలిసిందే.. నువాన్ కులశేఖర్ బౌలింగ్ లో లాంగాన్ మీదుగా ఎంఎస్ ధోని సిక్సర్ కొట్టగా.. ఆ బంతి పడ్డ చోటును ఎంసీఎ.. 2011 వరల్డ్ కప్ విక్టరీ మెమోరియల్ గా మార్చింది. సరిగ్గా ఆ బంతి పడ్డ చోటును వరల్డ్ కప్ విక్టరీ మెమోరియల్ గా మార్చి ఎంసీఎ.. ధోనితోనే దానిని ప్రారంభించింది. ముంబై ఇండియన్స్ తో ఐపీఎల్ -16లో మ్యాచ్ ఆడేందుకు వాంఖెడ్ కు వచ్చిన ధోనితో ఎంసీఎ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ధోని కొట్టిన బంతి పడ్డ చోటును అలంకరించి అతడితోనే ఓపెనింగ్ చేయించింది. ముంబై-చెన్నై మధ్య ఇవాళ రాత్రి జరుగనున్న ఎల్ క్లాసికో మ్యాచ్ కు ముందు ధోనితో ఈ వరల్డ్ కప్ విక్టరీ మెమోరియల్ ను ప్రారంభించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2011 ఏప్రిల్ 2న భారత జట్టు.. తమ రెండో వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుని 12 ఏండ్లు పూర్తైన సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వహించింది.

Also Read : IPL2023 : సీఎస్కే మ్యాచ్ తో మ్యాచ్.. సచిన్ తనయుడు అరంగేట్రం నేడే..!

క్వార్టర్స్ లో ఆస్ట్రేలియాను, సెమీస్ లో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరిన టీమిండియా.. ఫైనల్ లో లంకతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ జట్టులో మహేళ జయవర్దెనే ( 103) సెంచరీ చేయగా.. తిలకర్నతే దిల్షాన్ ( 48), నువాన్ కులశేఖర్ ( 32)తో రాణించారు. 275 పరుగుల లక్ష్యంతతో బరిలోకి దిగిన భారత జట్టు 31 పరుగులకే ఓపెనర్లిద్దరు అవుట్ అయిపోయారు. వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ అవగా టోర్నీ ఆసాంతం రాణించిన సచిన్ టెండూల్కర్ ( 18) కూడా విఫలమయ్యాడు. అప్పుడే కొత్తగా టీమ్ లోకి వస్తున్న విరాట్ కోహ్లీ ( 35) తో కలిసి గౌతం గంభీర్ ( 97) భారత ఇన్సింగ్స్ ను కుదటపరిచాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 83 పరుగులు జోడించారు. కానీ కోహ్లీని దిల్షాన్ ఔట్ చేశాడు. కోహ్లీ నిష్క్రమణ తర్వాత వాస్తవానికి ఐదో స్థానంలో యువరాజ్ బ్యాటింగ్ కు రావాలి.. కానీ అలా కాకుండా టీమిండియా సారథి అయిన ఎంఎస్ ధోని క్రీజులోకి వచ్చాడు. గౌతం గంభీర్ తో కలిసి ఒక్కో పరుగుల కూడదీసుకుంటూ భారత్ ను విజయం వైపునకు నడిపించాడు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 109 పరుగుల భాగస్వామ్యం జోడించారు. గంభీర్ ను పెరీరా ఔట్ చేసినా అప్పటికే భారత విజయానికి చేరువలో ఉంది. చివర్లో యువరాజ్ ( 21 నాటౌట్ ) తో కలిసి ధోని 91 పరుగులతో నాటౌట్ గా నిలవడమే కాకుండా భారత్ కు వన్డే వరల్డ్ కప్ అందించాడు.

Also Read : Bearded Woman : బామ్మా మజాకా ! నీ గడ్డం మీసం అదుర్స్

Exit mobile version