Site icon NTV Telugu

MS Dhoni: అవన్నీ అబద్దాలే.. వదంతులపై మిస్టర్ కూల్ క్లారిటీ!

Ms Dhoni

Ms Dhoni

MS Dhoni: భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మైదానంలో ఎంతో ప్రశాంతంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించే ధోనీకి “మిస్టర్ కూల్” అని కూడా పిలుస్తుంటారు అభిమానులు. వికెట్‌ కీపింగ్‌, మ్యాచ్ ఫినిషింగ్ స్కిల్స్‌తో పాటు జట్టు నాయకత్వంలో ఎన్నో అపురూప విజయాలను అందించిన ధోనీ క్రికెట్‌ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇకపోతే, ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ తన జీవితంలో ఎదురైన అత్యంత హాస్యాస్పద వదంతుల గురించి చమత్కారంగా స్పందించారు.

ఆ కార్యక్రమంలో ధోనికి ఓ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. మీ జీవితంలో వచ్చిన అతి హాస్యాస్పద వదంతి ఏది? అని ప్రశ్నించగా.. దానికి ధోనీ నవ్వుతూ, “నేను రోజూ 5 లీటర్ల పాలు తాగుతాను అని వినడం” అని సమాధానమిచ్చారు. నిజానికి ఒక లీటరు పాలు తాగుతానేమో కానీ, మిగతా నాలుగు లీటర్లు తాగడమంటే.. అది ఎలా సాధ్యం అవుతుంది? ఎవరు ఐదు లీటర్లు తాగగలరు? అంటూ హాస్యంగా స్పందించారు. అలాగే మరో వదంతి గురించి ప్రస్తావిస్తూ.. నేను వాషింగ్‌ మెషీన్‌లో లస్సీ తయారు చేసి తాగుతానట, నిజానికి నాకు లస్సీ అంటే ఇష్టం కూడా లేదు. ఇది పూర్తిగా వదంతే అని ధోనీ క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version