NTV Telugu Site icon

MS Dhoni: నువ్వు మహా చిలిపి బ్రో.. అభిమానిని ఆట పట్టించిన ధోని

Dhoni

Dhoni

MS Dhoni Asked His Fan Chocolate Box after Giving Autograph: భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని ఎంతో ప్రత్యేకం. సక్సెస్ కెప్టెన్ ధోని. భారత్ కు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టాడు ధోని. భారత క్రికెట్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగేలా చేశాడు. ఇక ధోని తన ఆటతోనే కాదు తన ప్రవర్తన కారణంగా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూల్ గా ఉండి జట్టును గెలిపిస్తాడు ధోని. ఎప్పుడూ బ్యాలెన్స్డ్ గా ఉంటాడు. అంతేకాకుండా అభిమానులను కూడా ఎంతో ఆప్యాయ్యంగా పలకరిస్తూ ఉంటాడు. అందుకే రిటైర్డ్ అయిన తరువాత కూడా ధోనికి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా తన ఫ్యాన్ తో ధోని ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: BHA vs SL: నేడు భారత్, శ్రీలంక ఢీ.. మ్యాచ్‌పై కన్నేసిన వరుణుడు! రద్దు మంచిదే

ధోని ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్నారు. ఇటీవలే ముగిసిన యూఎస్ ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ పోటీలను సైతం ఆయన చూశారు. అంతేకాకుండా అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో సైతం ధోని గోల్ఫ్ ఆడాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది. అమెరికా పర్యటనలో ఉన్న ధోనిని ఓ అభిమాని కలిశాడు. చిన్న బ్యాట్స్ తీసుకొచ్చి వాటిపై సంతకం కావాలని కోరాడు. అభిమానులకు ఎంతో దగ్గరగా ఉండే ధోని ఆయన తెచ్చిన బ్యాట్ లపై సంతకాలు చేసి ఇచ్చాడు. ఒక చేత్తో బ్యాట్ లు, మరో చేత్తో చాక్లెట్ డబ్బా పట్టుకున్న ఆ అభిమాని ధోని ఆటోగ్రాఫ్ తీసుకున్న ఆనందంలో చాక్లెట్లు ఇవ్వడం మర్చిపోయాడు. దీంతో ధోనినే తనకు చాక్లెట్లు ఇవ్వాలని అడిగి మరీ తీసుకున్నాడు. దీనిని క్రిక్ వాచర్ అనే యూజర్(ఎక్స్) ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. ఇది చూసిన అభిమానులు ధోని సింప్లిసిటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.