Site icon NTV Telugu

PEDDI : పెద్ది స్పెషల్ సాంగ్.. రామ్ చరణ్ సరసన సొగసుల సుందరి

Peddi

Peddi

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది.  రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయినా గ్లిమ్స్, సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. అయితే ఈ సాంగ్ లో చరణ్ సరసన ఎవరునటిస్తారోనని గత కొద్దీ రోజులుగా పలువురి పేర్లు హల్ చల్ చేశాయి. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో ‘స్పెషల్ సాంగ్’ చేయబోతున్నారట. రామ్ చరణ్‌తో కలిసి ఆమె వేయబోయే స్టెప్పులు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

Also Read : Toxic : వాయిదా వేసి ధురంధర్ 2 దాడి నుండి తప్పించుకున్న ‘టాక్సిక్’

రష్మిక మందన్న ఈ ఆఫర్‌ను తిరస్కరించడంతో ఆ ఛాన్స్ మృణాల్‌కు దక్కినట్లు సమాచారం. మృణాల్ అందం రామ్ చరణ్ డాన్స్ ఈ సాంగ్ కే హైలెట్ గా నిలుస్తాయట. మరోవైపు మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పెద్ది’ టీజర్ మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది. ఈ టీజర్‌కు ‘కుస్తీ’ అనే పేరును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ సినిమాపై ఉన్న హైప్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ఈ టీజర్‌లో చరణ్ తన రగ్గడ్ లుక్ మరియు రెజ్లింగ్ విన్యాసాలతో అలరించబోతున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. ఏప్రిల్ మధ్య నాటికి మొత్తం పనులు పూర్తి చేసి ప్రమోషన్లతో హోరెత్తించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

Exit mobile version