NTV Telugu Site icon

Mrunal Thakur : ఆ సీన్ నన్ను ఎంతో ఇబ్బంది పెట్టింది..

Whatsapp Image 2024 04 26 At 8.34.08 Am

Whatsapp Image 2024 04 26 At 8.34.08 Am

క్యూట్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”సీతారామం” సినిమాతో ఈ భామకు క్రేజ్ భారీగా పెరిగింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈ భామ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. మృణాల్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోకూడా వరుస సినిమాలలో నటిస్తుంది.అయితే మృణాల్ ముందుగా బాలీవుడ్ సినిమాలతోనే ప్రేక్షకులకు పరిచయం అయింది.తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన “జెర్సీ” సినిమాని హిందీలో రీమేక్ చేయగా అందులో వరుణ్ ధావన్ హీరోగా నటించారు. వరుణ్ ధావన్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నటి మృణాల్ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేసారు.

తాను వరుణ్ ధావన్ కి పెద్ద అభిమానిని మృణాల్ తెలిపారు. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడంతో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ సినిమాకు ఓకే చెప్పినట్లు ఆమె తెలిపారు.ఇక ఈ సినిమా మొదటిరోజు షూటింగ్ సమయంలో తాను ఎంతో భయపడినట్లు ఆమె తెలిపారు. అయితే షాహిద్ నవ్వుతూ ఉండడంతో తనని చూస్తూ అలా ఉండిపోయానని ఆయన ఆన్ స్క్రీన్ పై ఎలా నవ్వుతూ ఉంటారో ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే నవ్వుతూ కనిపిస్తారని మృణాల్ తెలిపింది.అయితే ఇందులో ఓ సీన్ లో హీరోని కొట్టాల్సి ఉంటుంది.ఆ సీన్ చేయడానికి నేను చాలా భయపడ్డాను. నేను చిన్నగా కొడతాను మీరు ఎడిటింగ్ లో చేసుకోండని చెప్పాను కానీ డైరెక్టర్ మాత్రం అసలు ఒప్పుకోలేదు. ఇక వరుణ్ ధావన్ కూడా ఆ సమయంలో ఎంతో సపోర్ట్ చేశారు.. మీరు మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని గుర్తు చేసుకొని నన్ను కొట్టండి అంటూ తనకు సలహాలు ఇచ్చినట్లు ఆమె తెలిపింది.అయితే ఆ సీన్ దాదాపు మూడు గంటల పాటు చేశామని మృణాల్ చెప్పుకొచ్చారు .

Show comments