NTV Telugu Site icon

Mrunal Thakur: సూసైడ్ చేసుకుందామనుకున్న.. మృణాల్ ఠాకూర్

Mrunal Thakur1 (1)

Mrunal Thakur1 (1)

Mrunal Thakur: మృణాల్‌ ఠాకూర్‌.. ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది సినిమా ఇండస్ట్రీ. ‘సీతా రామం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మరాఠీ నటి. మరాఠీ సినిమాల ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యింది ఆమె మొదటి హిందీ చిత్రం లవ్ సోనియా (2018). ఆ తర్వాత ఆమె అనేక చిత్రాలలో నటించింది. అయితే ఈ భామ తొలి చిత్రంతోనే భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సీత పాత్రలో తనదైన నటన, అందంతో ప్రేక్షకులను మంగ్రముగ్ధుల్ని చేసింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు ఇస్తున్నారు. మృణాల్‌కు స్టార్ హీరో సరసన నటించే అవకాశాలు వచ్చినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మృణాల్‌.. తన వ్యక్తిగత జీవితం సినిమా కెరీర్‌లోకి ఎలా ప్రవేశించిందన్న అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నిజానికి నేను డాక్టర్ కోర్స్‌ చేశాను. నాకు డెంటిస్ట్ కావాలని యాంబీషన్ ఉండేది. ఎంట్రెన్స్ టెస్ట్ లో మంచి మార్కులు కూడా వచ్చాయి. అయితే నాకు మాత్రం నటి కావాలనే కోరిక బలంగా ఉండేది. అందుకు అమ్మానాన్న ఒప్పుకునే వారు కాదు. ఈ క్రమంలోనే ఓ రోజు వారికి ‘త్రీ ఇడియట్స్‌’ సినిమాను చూపించాను. అందులో నచ్చిన పని చేయడంలో ఉన్న సంతోషం, నచ్చిన పనే చేయాలనే సందేశం వారికి నచ్చింది. సినిమా చూసిన తర్వాతే స్వయంగా అమ్మానాన్నే నన్ను ప్రోత్సహించారు. సినిమాల్లో ప్రయత్నించమని వెన్నంట నిలిచారు’ అని చెప్పుకొచ్చింది.

Read Also: Jagapathi Babu: ‘రుద్రంగి’లో జగపతి బాబు.. లుక్ అదుర్స్

సినిమా అవకాశాలు పొందడం అంత సులభం కాదని చెప్పిన మృణాల్‌.. కానీ మృణాల్ చదువుకుంటున్న చదువు వల్ల బయట చాలా అవమానం జరిగేది అంట. ఇక ఆ తర్వాత ఆమె తండ్రి కి ట్రాన్స్పర్ రావడం తో ఆమె ముంబై లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ఇక దీని గురించి ఆలోచిస్తూ ఆమె ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లి ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ట్రైన్ లో నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందని వెల్లడించింది. ఆ తర్వాత ఆమెకు ఎన్నో కష్టాల తర్వాత లవ్ సోనియా సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఒక వేశ్య పాత్రలో ఆమె నటించింది. అయితే ఆ పాత్ర కోసం మృణాల్ వేశ్య గృహం లో వల్ల కథలు వినడానికి అక్కడ ఒక రెండు వారాలు ఉందట. అయితే అప్పుడు వల్ల కథలు విని ఆమె ఎంతో డిప్రెషన్ కు గురైందని అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని అనుకుంది అంట. సీతా రామం సక్సెస్ తర్వాత మృణాల్ ఠాకూర్ రెమ్యునరేషన్‌ను డబుల్ చేశారని అయినా కూడా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ భామ వైజయంతి బ్యానర్ పై మరో సినిమా కూడా చేస్తుందని టాక్.

Show comments