సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ భామ తన హాట్ లుక్స్ తో రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ కోట్ అండ్ ప్యాంట్ ధరించి ఎంతో హాట్ గా కనిపించింది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ తెగ వైరల్ అవుతుంది.మృణాల్ ఠాకూర్ తాజాగా సైమా వేడుకల కోసం దుబాయ్ కు వెళ్లారు.దుబాయ్ లో సైమా అవార్డ్స్ ఈవెంట్ సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఎంతో ఘనంగా జరగనుంది. సైమా ఈవెంట్ అనౌన్స్మెంట్ కార్యక్రమంలో రానా దగ్గుబాటి మరియు మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. ఇందు కోసం మృణాల్ సరికొత్త లుక్ లో దర్శనమిచ్చింది.
మృణాల్ ఠాకూర్ సీరియల్ హీరోయిన్ గా తన సినీ కెరీర్ ప్రారంభించారు. బుల్లితెర ద్వారా వచ్చిన పేరు తో ఈ భామ హీరోయిన్ అయ్యారు.మరాఠీ సినిమా తో ఈ భామ వెండి తెరకు పరిచయమయింది.. ఆ తరువాత ఈ భామ హిందీలో లవ్ సోనియా అనే సినిమా చేసింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి పాపులర్ అయింది.తెలుగులో సీతారామం సినిమాతో పరిచయం అయింది ఈ భామ.సీతారామం సినిమాలో మృణాల్ క్యూట్ లుక్స్ కి టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో ట్రేడిషనల్ వేర్ లో అందరినీ ఆకట్టుకుంది.అంచనాలు లేకుండా విడుదల అయినా ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. హిందీలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది.మృణాల్ కి ప్రస్తుతం తెలుగులో భారీ ఆఫర్స్ వస్తున్నాయి. దసరా మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టిన నానికి జంటగా ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీ షూటింగ్ కూడా చివరి దశలో ఉన్నట్లు సమాచారం.. అలాగే విజయ్ దేవరకొండతో మరొక సినిమాకు కమిట్ అయింది ఈ భామ.ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.