సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ బాగా పెరిగింది.. ఇక ఈ అమ్మడు తో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. ఈక్రమంలోనే నాని ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండ ‘VD13’లో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తన 157వ సినిమాని ‘బింబిసార’ దర్శకుడు వశిష్టతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే..
ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ఆ పాత్రకు మృణాల్ ఠాకూర్ అయితేనే న్యాయం చేయగలదని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇందుకోసం మేకర్స్ ఆల్రెడీ ఆమెను సంప్రదించినట్లు కొన్ని వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారట..
ఇకపోతే యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ నేపథ్యంతో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. చిరు గతంలో ‘అంజి’ సినిమాతో సోషియో బ్యాక్‌డ్రాప్ ని టచ్ చేశాడు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. మరి ఇప్పుడు ఈ Mega 157 చిరుకి హిట్ ఇస్తుందా.. లేదా చూడాలి.. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది..
