NTV Telugu Site icon

Mrunal – Dulquer : మరోసారి జతకట్టనున్న సీతారామం జంట.. ఈ సారి వేరే లెవల్

New Project (89)

New Project (89)

Mrunal – Dulquer : మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. దుల్కర్ సల్మాన్ కి తెలుగు ఇండస్ట్రీ బాగా అచ్చివచ్చింది. తెలుగులో తను సినిమా చేశాడంతే కచ్చితంగా హిట్టే అన్న సెంటిమెంట్ ఏర్పడింది. మహానటి, సీతారామం తర్వాత గతేడాది విడుదల అయిన లక్కీ భాస్కర్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. చిన్నగా తెలుగులో తన మార్కెట్ పెంచుకుంటూ ఇక్కడ స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు దుల్కర్ సల్మాన్. ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ పవన్ సాధినేని దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ సాయి పల్లవిను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఐతే దుల్కర్ తో మృణాల్ సూపర్ హిట్ జోడీ అనిపించుకుంది. సీతారామం సినిమా కథ కథనాలతో పాటు దుల్కర్, మృణాల్ జంట ఆకట్టుకుంది. అందుకే మళ్లీ ఆ కాంబోలో ఒక సినిమా చూడాలని అభిమానులు కోరుతున్నారు. మృణాల్ కూడా తెలుగులో మూడు సినిమాలు చేయగా రెండు సినిమాలు సూపర్ హిట్ అందుకున్నాయి. ప్రస్తుతం ముద్దుగుమ్మ అడివి శేష్ తో డెకాయిట్ అనే సినిమా చేస్తుంది. ఐతే దుల్కర్ సల్మాన్, మృణాల్ కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Read Also:MLC Jeevan Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అవమానించడం కరెక్ట్ కాదు..

ఆకాశంలో ఒక తార సినిమాలో సాయి పల్లవిని తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐతే సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒకవేళ ఆమె కాదు అంటే నెక్స్ట్ ఆప్షన్ గా మృణాల్ ని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ హిట్టు కొట్టిన జంట కాబట్టి ఈ జోడీని చూసేందుకు ఆడియన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఉంటారు. తెర మీద హీరో హీరోయిన్ జంట ప్రేక్షకులను మెప్పించగలిగితే చాలు వాళ్లని మళ్లీ మళ్లీ అలా కలిసి చూడాలని కోరుకుంటారు. అలానే దుల్కర్ – మృణాల్ జంటను మళ్లీ మరో సినిమాలో చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మృణాల్ కూడా దుల్కర్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉంది. ఈ కలయికలో సినిమా వస్తే మరో బ్లాక్ బస్టర్ పక్కా అనే ఆలోచనలో ఉన్నారు. సందీప్ గుణ్ణం నిర్మిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also:Greenland: గ్రీన్‌ల్యాండ్‌ని కొనేందుకు ట్రంప్ ప్లాన్.. వాస్తవానికి ఆ ద్వీపం ఏ దేశానికి చెందినదంటే ?

Show comments