Mrinal Thakur : సినీ ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ కొనసాగుతుందంటూ ఇటీవల వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఫేమ్ ఉన్న కథానాయికలు హీరోలకు సమానంగా తమ రెమ్యునరేషన్ ఉండాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా తారల పారితోషికాలపైనే చర్చ నడుస్తోంది. హీరోలకు ఎక్కువ పారితోషకాలు ఇస్తూ నాయికలను పట్టించుకోవట్లేదనేది వారి వాదన. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా వారికి గుర్తింపు ఉండడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె రెమ్యునరేషన్స్ విషయంలో హీరోయిన్స్ నిక్కచ్చిగా వ్యవహరించాలని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ప్రేక్షకుల్లో మనకున్న ఇమేజ్‌ను బట్టి ఎంత పారితోషికం ఇవ్వాలో నిర్ణయిస్తారు. అయితే చాలా మంది నాయికలు తాము కోరుకున్న పారితోషికాల్ని డిమాండ్ చేసే విషయంలో తెలియని అయోమయంలో ఉంటారు. అది మంచిది కాదు. రెమ్యునరేషన్ ఎంత కావాలో ముందే స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే మనం వృత్తి విషయంలో ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామో అర్థమవుతుంది’ అని పేర్కొంది.
Mrinal Thakur : డిమాండ్ చేసి రెమ్యూనరేషన్ తీసుకుంటానంటున్న హీరోయిన్
Show comments