Mr.Pregnant : మిస్టర్ ప్రెగ్నెంట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీరియల్ హీరోగా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన సోహైల్.. ఇప్పుడు సినిమా హీరో గా ఆకట్టుకుంటున్నాడు.బిగ్‌బాస్ రియాల్టీ షో తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు సోహైల్.ఇటీవల సోహైల్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో సరికొత్త కథల తో ప్రేక్షకులని మెప్పించాలనే ఉద్దేశంతో హీరో సోహైల్ విభిన్న కథలను సెలెక్ట్ చేసుకునే పని లో వున్నాడు. దానిలో భాగంగా ఇటీవల మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ను శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో సోహైల్ సరసన రూపా కొడువాయూర్ కథనాయికగా నటించింది. అలాగే సుహాసిని, రజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, వైవా హర్ష ముఖ్య పాత్రలు పోషించగా మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి నిర్మించారు.
ఆగస్ట్ 18 న విడుదలై ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. పురుషుడు గర్భం దాలిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.. అనే సరికొత్త కథాంశంతో ఈ సినిమా ను రూపొందించారు.థియేటర్స్ లో పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఈ ఓటీటీ లో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటి సంస్థ ఆహా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.మిస్టర్ ప్రెగ్నెంట్ చిత్రాన్ని అక్టోబర్ 6 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వెల్లడించింది. ‘మిస్టర్ ప్రెగ్నెంట్.. వినడానికే కొత్తగా ఉంది కదా. ఎంటర్టైన్మెంట్ కూడా కొత్తగానే ఉంటుంది. ఎమోషనల్ డ్రామా కోసం మీరంతా రెడీగా ఉండండి. అక్టోబర్ 6న మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ప్రీమియర్ కానుంది’ అంటూ ఆహా ఓటీటీ ట్వీట్ చేసింది.ఇదిలా ఉంటే ఈ సినిమా ఆహాతోపాటు,అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా స్ట్రీమింగ్ కానుంది. ఆక్టోబర్ 6 నుంచి ఈ ప్రేక్షకులకు ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Tags
- Mr Pregnant
- OTT
- release
- Sohel
తాజావార్తలు
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!