Site icon NTV Telugu

Vijaysai Reddy: ఎంబీబీఎస్ విద్యార్థులకు కొత్త పాఠ్య ప్రణాళిక

Vijayasai

Vijayasai

ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం జాతీయ మెడికల్ కమిషన్ కొత్త బోధన ప్రణాళికకు సంబంధించిన మార్గ దర్శకాలను ఈ ఏడాది ఆగస్టు 1న జారీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు. రాజ్యసభలో ఇవాళ వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిస్తూ కొత్త బోధన ప్రణాళిక కింద వృత్తి పరంగా మొదటి సంవత్సరంలో “కుటుంబ దత్తత కార్యక్రమం-లక్ష్యాలు అందుకోవడం” అనే పాఠ్యాంశంలో భాగంగా విద్యార్థులు ఆయా ప్రాంతాలకు సంబంధించిన గ్రామీణ స్థితిగతులను అర్థం చేసుకోవలసి ఉంటుందని మంత్రి తెలిపారు. కాంపిటెన్సీ బేస్డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పేరిట రూపొందించిన ఈ కొత్త బోధనా ప్రణాళికకు సంబంధించిన మార్గ దర్శకాలు జాతీయ మెడికల్ కమిషన్ వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కేంద్రమంత్రి సహాయ మంత్రి డాక్టర్ ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు.

Exit mobile version