Site icon NTV Telugu

MP Vemireddy Prabhakar Reddy Resigns: వైసీపీకి బిగ్‌ షాక్..! ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

Mp Vemireddy Prabhakar Redd

Mp Vemireddy Prabhakar Redd

MP Vemireddy Prabhakar Reddy Resigns: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి బిగ్ షాక్‌ తగిలినట్టు అయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. ఎంపీ పదవితో పాటు.. జిల్లా అధ్యక్ష పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.. ఈ మేరకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి..

నేను, నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి మరియు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమికి సభ్యత్వానికి రాజీనామా చేయుచున్నాను.. నా రాజీనామాను తక్షణమే ఆమోదించవలసిందిగా కోరుచున్నాను.. ఈ సందర్భంగా మీరు న ఆకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదములు తెలియిజేస్తున్నాను అంటూ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. ఇక, నేను, నా వ్యక్తిగత కారణాల వలన నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియజేస్తున్నాను అంటూ మరో పత్రికా ప్రకటన విడుదల చేశారు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి..

అయితే, గత కొంత కాలంగా వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి.. వైసీపీని వీడుతారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. ఇదే సమయంలో.. ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం జోరుగా సాగింది.. త్వరలోనే ఆయన టీడీపీలో చేరతారని.. అందుకే వైసీపీకి గుడ్‌బై చెప్పేశారనే చర్చ సాగుతోంది.. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి వేమిరెడ్డి.. లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు.. మరి వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. తన రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

 

Exit mobile version