NTV Telugu Site icon

Uttam Kumar Reddy : నాలుగేళ్లలో ఎయిమ్స్ బీబీనగర్ ఏర్పాటులో ఎలాంటి పురోగతి లేదు

Uttam Kumar Redy

Uttam Kumar Redy

బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ని పూర్తి చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలోని టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంతో కచ్చితమైన వైఖరి అనుసరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు.

శుక్రవారం లోక్‌సభలో తాను లేవనెత్తిన ఎయిమ్స్ బీబీనగర్‌కు సంబంధించిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయా ఇచ్చిన సమాధానంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత నాలుగేళ్లలో ఎయిమ్స్ బీబీనగర్ ఏర్పాటులో ఎలాంటి పురోగతి లేదని కేంద్రమంత్రి అందించిన గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు.

ప్రధాన మంత్రి స్వాస్త్య సురక్ష యోజన (PMSSY) కింద మంజూరైన దేశవ్యాప్తంగా 22 కొత్త ఎయిమ్స్‌లో AIIMS బీబీనగర్‌ కూడా ఉందని ఆయన అన్నారు. భోపాల్ (మధ్యప్రదేశ్), భువనేశ్వర్ (ఒడిశా), జోధ్‌పూర్ (రాజస్థాన్), పాట్నా (బీహార్), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) మరియు రిషికేశ్ (ఉత్తరాఖండ్)లో 6 AIIMS పూర్తిగా పనిచేస్తుండగా, AIIMS బీబీనగర్‌తో సహా మిగిలిన 16 AIIMS కార్యకలాపాలు వివిధ దశల్లో ఉన్నాయి. . అయితే, ఎయిమ్స్ బీబీనగర్‌ను పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు విడుదల చేయలేదని, మంజూరైన ఖాళీలను భర్తీ చేయలేదన్నారు.

AIIMS బీబీనగర్‌కు కేంద్ర మంత్రి వర్గం 17 డిసెంబర్ 2018న ఆమోదం తెలిపిందని మరియు ప్రాజెక్ట్ కోసం రూ.1,028 మంజూరు చేసిందని ఇందులో ఇప్పటివరకు కేవలం రూ.31.71 కోట్లు మాత్రమే విడుదల చేసిందని అన్నారు. ఇంకా ఈ ఆసుపత్రి పూర్తి చేయడానికి గడువు సెప్టెంబరు 2022గా నిర్ణయించిన ఇప్పుడు జనవరి 2025 వరకు పొడిగించారని మరియు ఇప్పుడు గడువుపై కేంద్రం మౌనంగా ఉంద, ”అని ఆయన అన్నారు.

బీబీనగర్ ఎయిమ్స్ సహా దేశవ్యాప్తంగా ఎయిమ్స్ ఏర్పాటుపై 2019 నవంబర్ 29 మధ్య నేటి వరకు 10 సార్లు పార్లమెంటులో వివిధ ప్రశ్నలు లేవనెత్తినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎయిమ్స్ బీబీనగర్‌పై కేంద్రం ఇచ్చిన సమాధానాలు ప్రాజెక్టు, అనివార్య కారణాలతో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని స్పష్టం చేశారు.

Show comments