Site icon NTV Telugu

MP R Krishnaiah : పార్లమెంట్‌లో ఆ బిల్లు ప్రవేశపెట్టిన ఘనత వైసీపీదే

Mp R Krishnaiah

Mp R Krishnaiah

పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్ సీపీ దే అన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బీసీ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే అని ఆయన కొనియాడారు. విద్య వైద్య, సామాజిక రంగాల్లో బీసీలకు పెద్దపీట వేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. యాభై శాతం రిజర్వేషన్ల సీలింగ్ తొలగిపోయిందని, సుప్రీం కోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన అన్నారు.

Also Read : Twitter Paid Verification Service: ట్విట్టర్‌ బ్లూటిక్‌.. భారతీయులు ఎంత చెల్లించాలో తెలుసా..?

దేశంలో బీసీ ముఖ్యమంత్రులు చేయలేని చాలా పనులను సీఎం జగన్ చేశారని ఆయన ప్రశంసించారు. రాజకీయాల్లో బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు సాధించేందుకు దేశవ్యాప్తంగా పోరాటం అవసరమన్నారు. ఇదిలా ఉంటే.. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును పాస్ చేయాలని, బీసీ కులాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం పది లక్షల నుంచి 20లక్షలు ఇవ్వాలని, కార్పొరేట్లకు రుణమాఫీ కాదు, బీసీలకు ఆర్థిక అభివృద్ధికి చేయూత ఇవ్వాలి. బీసీలకు చారిత్రక అన్యాయం జరిగింది అని ఎంపీ ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు.

Exit mobile version