చంద్రబాబు- పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పై సింగిల్ గా పోటీ చేసే ధైర్యముందా? అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆయన మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు జగన్ కి పూర్తిగా సపోర్టు ఇస్తున్నారు.. వైసీపీ పాలనతో ఏపీలో పేదరికం తగ్గింది.. ఆకలి తీర్చే నాయకుడు కావాలో – మోసం చేసే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ఎంపీ నందిగాం సురేష్ చెప్పారు.
Read Also: Unstoppable: బాలయ్య తో మరోసారి మహేష్.. ?
అయితే, చంద్రబాబుకు ఏదో ఒక రోజు శిక్ష పడుతుందని కోర్టులు చెప్తున్నాయని ఎంపీ సురేష్ తెలిపారు. ఈ రాష్ట్రానికి లోకేష్ అవసరం ఏముంది?.. రాష్ట్ర సంపదను దోచుకున్నారు, అందువల్లే ప్రజలు పక్కన పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని టీడీపీకి అద్దెకు ఇచ్చారు.. పవన్ కళ్యాణ్ అవసరం అయినపప్పుడు పార్టీని అప్పుడప్పుడు తాకట్టు పెడుతున్నాడు.. ఆయనకు తెలంగాణలో డిపాజిట్లు రాలేదు అని ఎంపీ ఆరోపించారు. పవన్ కళ్యాణ్,చంద్రబాబు వెళ్ళి బర్రెల అక్క చంక నాకండి అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అవసరం ఈ రాష్ట్రానికి లేదు.. జగన్ మోహన్ రెడ్డిపై సింగిల్ గా పోటీ చేసే ధైర్యం ఎందుకు లేదు? అని ఎంపీ నందిగాం సురేష్ ప్రశ్నించారు.