లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి తొలి రోజు కస్టడీ ముగిసింది. 4 గంటలపాటు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం GGH కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించారు. మిథున్ రెడ్డిని పలు విషయాలపై సిట్ ప్రశ్నించింది. లిక్కర్ స్కాంలో వసూలు చేసిన డబ్బులు మిథున్ రెడ్డి వ్యాపార సంస్థలోకి వెళ్ళటంపై ప్రశ్నించింది. ఐదేళ్ల కాలంలో కొత్తగా కొనుగోలు చేసిన ఆస్తుల గురించి విచారణలో ప్రస్తావించింది. ఎన్నికల అఫిడవిట్ లోనే ఆస్తుల వివరాలు ఉంచినట్టు విచారణలో తెలిపాడు మిథున్ రెడ్డి. ఫోన్ గురించి ఆరా తీశారు సిట్ అధికారులు. మిథున్ రెడ్డి మొబైల్ ను ఎఫ్ఎస్ఎల్ కి పంపాలని సిట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అనేక ప్రశ్నలకు మిథున్ రెడ్డి సహకరించేలేదన్న భావనలో సెట్ అధికారులు ఉన్నట్లు సమాచారం.
Also Read:Berlin Bomb Scare: పాపం ఎప్పుడు పోయేవాళ్లో.. జర్మనీలో 80 ఏళ్లుగా పేలని బాంబు
కాగా, ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో ఏ-4గా ఉన్నారు ఎంపీ మిథున్ రెడ్డి.. భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ గతంలో మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. ఇక, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం 5గంటల లోపు రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోవాలంటూ కోర్టు షరతులు విధించగా.. ఆ మేరకు ఆయన కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే.
