NTV Telugu Site icon

MP Mithun Reddy: ఈ ప్రభుత్వంలో ఇదే చివరి అమ్మఒడి.. ఇక ఎన్నికల తర్వాతే..

Mp Mithun Reddy

Mp Mithun Reddy

MP Mithun Reddy: వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ ప్రభుత్వంలో ఇదే చివరి అమ్మఒడి అని స్పష్టం చేశారు రాజంపేట, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. అన్నమయ్య జిల్లా మదనపల్లి మసీదు కాంప్లెక్స్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 41.32 కోట్ల రూపాయల అమ్మఒడి నిధుల చెక్కును అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు చేసింది ఏమిలేదు అని మండిపడ్డారు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయని తెలిపారు.

Read Also: Deepika padukone : దీపికా ఏడాది సంపాదన ఎంతో తెలుసా..?

కాగా, గత నెలలో కురుపాంలో 2023-24 ఏడాదిగానూ.. అమ్మ ఒడి నిధుల్ని బటన్‌ నొక్కి నేరుగా తల్లుల ఖాతాలో జమ చేశారు సీఎం జగన్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదిరోజులపాటు పండుగలా జగనన్న అమ్మ ఒడి కొనసాగుతోంది. అన్ని స్కూల్స్‌, కాలేజీల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి నిధులు జమవుతున్నాయి. అవినీతి, వివక్ష లేకుండా నేరుగా నిధులు అందజేస్తున్నాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకే అమ్మ ఒడి పథకం. ప్రపంచస్థాయిలో పిల్లలు పోటీపడేలా తీర్చిదిద్దుతున్నాం. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి మన పిల్లలు రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. వచ్చే తరం మనకంటే బాగుండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం అని పేర్కొన్నారు.. ఇక, రోజుకో మెనూతో విద్యార్థులకు గోరుముద్ద అందిస్తున్నాం. పిల్లలకు తొలిసారిగా బైలింగ్వుల్‌ పుస్తకాలు అందజేస్తున్నాం. పిల్లలకు సులువుగా అర్థమయ్యేందుకు డిజిటల్‌ బోధనను తీసుకొచ్చాం. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులకు అమ్మ ఒడి అందిస్తున్నాం. అమ్మ ఒడి కింద ఇప్పటి వరకు రూ.26,067.28 కోట్లు అందజేశామని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించిన విషయం విదితమే.