Site icon NTV Telugu

Mithun Reddy: చేసిన ఆరోపణలు నిరూపించండి.. డిప్యూటీ సీఎంపై ఎంపీ ఫైర్..!

Mithun Reddy

Mithun Reddy

Mithun Reddy: శేషాచల అటవీ ప్రాంతంలో భూకబ్జాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన బహిరంగ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. జనసేన పార్టీ ‘బిగ్ ఎక్స్‌పోజ్‌’గా ప్రచారం చేసిన ఈ విషయం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతి పర్యటన సందర్భంగా.. మంగళంపేట అటవీ ప్రాంతంలోని అక్రమ ఆక్రమణలపై స్వయంగా పరిశీలన చేశారు. ఆయన ఏరియల్ వ్యూ వీడియోలు, మ్యాపింగ్‌లు, ఉపగ్రహ చిత్రాలతో కూడిన ఆధారాలను విడుదల చేశారు. ఈస్ట్‌ ఘాట్స్‌ పరిధిలోని రక్షిత అటవీ భూముల్లో సుమారు 76.74 ఎకరాల భూకబ్జా జరిగినట్లు అందులో పేర్కొన్నారు. ఈ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించినవని పవన్ కళ్యాణ్ తన ‘ఎక్స్’ ఖాతా పోస్టులో తెలిపారు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించారు. రక్షిత అటవీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరగడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ దానిపై దర్యాప్తు అవసరమని సూచించారు.

KVS NVS Recruitment 2025: కేంద్రీయ, నవోదయ విద్యాలయాలలో సుమారు 10,000 పోస్టులు!.. కొడితే లైఫ్ సెట్

అయితే ఈ విషయమై ఆరోపణలు ఎదురుకుంటున్న ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్‌ అటాక్‌ ఇచ్చారు. తాజాగా ఆయన పలు విషయాలలో పవన్ కళ్యాణ్ ను పేర్కొంటూ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. మిథున్ రెడ్డి ఈ పోస్టులో పవన్ కళ్యాణ్‌ను నేరుగా సవాల్‌ విసిరారు. ఆయన చేసిన పోస్ట్ లో.. పవన్ కళ్యాణ్ ను పేర్కొంటూ.. మీరు ఆరోపణలు చేసి తర్వాత వెనక్కి తగ్గడంలో నిపుణులు. ఇదే పని మీరు ఎర్రచందనం విషయంలో కూడా చేశారు. ఇప్పుడు మీరు హెలికాప్టర్‌ నుంచి చూపించిన భూమి మా చట్టబద్ధమైన సొత్తు. మేము ఆ భూమిని 2000 సంవత్సరంలో చట్టబద్ధంగా కొనుగోలు చేశాం అని మిథున్ రెడ్డి తెలిపారు. అలాగే, మీరు చేసిన ఆరోపణలు నిరూపించండి. ఆధారాలు ఉంటే బయటపెట్టండి. లేకపోతే ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయవద్దని ఆయన హెచ్చరించారు.

Office Romances: పెరిగిపోతున్న ఆఫీస్ ప్రేమాయణాలు.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..?

Exit mobile version