MP Magunta Srinivasulu Reddy Resigns: ఎన్నికల వేళ అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. అయితే, వచ్చే ఎన్నికల్లో మాగుంటకు వైసీపీ నుంచి టికెట్ లేదనే సంకేతాలు వెళ్లాయట.. దీంతో.. గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న ఆయన.. టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. మొత్తంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ రోజు ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.. మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తోంది.. మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారు.. ప్రకాశం జిల్లా వాసులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వస్తున్నాం.. మాగుంట కుటుంబానికి, ప్రజలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయన్నారు.
Read Also: Gollapalli Surya Rao: టీడీపీకి గొల్లపల్లి సూర్యారావు గుడ్ బై..!
ఇక, ఈ 33 ఏళ్లలో 8 సార్లు పార్లమెంట్ కి, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశాం.. మా కుటుంబం కోరుకునేది కేవలం గౌరవం మాత్రమే అన్నారు ఎంపీ మాగుంట.. మాకు ఇగోలు లేవు.. రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఓ నిర్ణయం తీసుకుంది.. మా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో, జిల్లాలో ప్రస్తుత పరిణామాలు బాధాకరంగా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం.. అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడాలనుకుంటున్నాం అని స్పష్టం చేశారు.. ఇక, ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ నుంచి కూడా సహాయ సహకారాలు అందాయి.. ఇప్పటివరకు సహకరించిన సీఎం జగన్‌కు, పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో బాధతో పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నా.. ఇవాళ వైసీపీకి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు. ఇక, త్వరలో తమ రాజకీయ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటాం.. అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తాం అన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. ఇంకా మీడియా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..