Site icon NTV Telugu

BJP MP Laxman: బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు.. కేవలం సలహాలు, సూచనలు మాత్రమే..

Laxman

Laxman

తెలంగాణ ప్రభుత్వం సహకారం లేకున్నా రాష్ట్రం కోసం కేంద్రం అభివృద్ది కార్యక్రమాలు చేస్తుంది అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. కులం కాదు గుణం ముఖ్యం అని కేటీఆర్ కూడా బీసీ లను అవమానించే విధంగా మాట్లాడారు.. బీసీ జన గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు.. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి.. టెక్నికల్ ఇష్యూ లు ఉన్నాయి.. రెడ్డి, చౌదరిలు కర్ణాటకలో బీసీలు.. వైశ్యులు, బ్రాహ్మణులు కొన్ని రాష్ట్రాల్లో బీసీలు.. వాళ్ళను బీసీలో చేర్చాల అని ఆయన అన్నారు. కర్ణాటక లో బీసీ సెన్సస్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం బయట పెట్టలేదు.. తమ పార్టీలోనే విభేదాలు ఉన్నాయని మల్లికార్జున్ ఖర్గేనే ఒప్పుకున్నాడు.. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి ఉమ్మడి పౌర చట్టంను తీసుకొచ్చేందుకు వర్క్ అవుట్ చేస్తామని లక్ష్మణ్ తెలిపారు.

Read Also: Minister KTR: కరెంట్ లేదంటున్నారు.. రేవంత్ రెడ్డి, ప్రేమ్ సాగర్ వైర్లు పట్టుకోండి..

బీసీల నుండి సీఎం అభ్యర్థులు మా పార్టీలో చాలా మంది ఉన్నారు అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు.. ఆర్ఎస్ఎస్ సలహాలు సూచనలు మాత్రమే ఇస్తుంది.. తాండూరులో మా మిత్రపక్షం జనసేన పోటీ చేస్తుంది.. మిత్ర పక్షంలో ఉన్న వారిని బీజేపీ గౌరవిస్తుంది.. సంస్థాగత మార్పులో భాగంగానే బండి సంజయ్ నీ మార్చడం జరిగింది.. ఇప్పుడు ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని ఎంపీ తెలిపారు. చిదంబరం వ్యాఖ్యలు హత్య చేసిన వాడే నివాళులు అర్పించినట్టు ఉంది.. ఈ రోజు వచ్చి క్షమాపణ చెబితే తెలంగాణ ప్రజలు క్షమించరు.. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో కర్ణాటక ప్రజలని మోసం చేసింది.. గ్యారంటీలు ఓట్ల కోసం వేసే గాలం మాత్రమేనని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నాయి.. బీజేపీ పాలిత రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాము.. ఇక్కడ కూడా అధికారం ఇస్తే తగ్గిస్తాము అని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Exit mobile version