Site icon NTV Telugu

K.Laxman : కాంగ్రెస్ వాస్తవాలు బయట పెట్టారు ప్రధాని

Laxman

Laxman

పార్లమెంట్‌లో మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ పై చేసిన వాఖ్యలు చర్చ జరుగుతోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రూ, ఉద్యోగాలు, రిజర్వేషన్లపై చేసిన మాటలు అని, ప్రధాని ఉభయసభల్లో బయట పెట్టారన్నారు. మండల కమిషన్ ను రాజీవ్ గాంధీ అడ్డుకున్నారని, అంబేడ్కర్ ను కాంగ్రెస్ ఓడించింది.. ఇబ్బంది పెట్టిందన్నారు లక్ష్మణ్‌. కాంగ్రెస్ వాస్తవాలు బయట పెట్టారు ప్రధాని అని, పది సంవత్సరాల యూపీఏ పాలన, పదేళ్ల ఎన్డీయే పాలన పోల్చి చూడాలన్నారు. ఎన్నో సంస్థలు మోడీ నేతృత్వంలో అభివృద్ధి చెందాయని, పదేళ్ల యూపీయే కాలంలో అవినీతే, కుంభకోణాలు ఇపుడు వెలుగులోకి వచ్చాయన్నారు లక్ష్మణ్‌. కుటుంబం కోసమే కాంగ్రెస్ పని చేస్తోందని, బీసీల పట్ల కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు.

Vishwak Sen: షూటింగ్లో నిజమైన అఘోరా అనుకోని డబ్బులు ధర్మం చేశారు

ఓట్ల కోసం విభజన రాజకీయాలు కాంగ్రెస్ చేస్తోందని, ప్రజలు కాంగ్రెస్ కు బుద్ది చెప్తారన్నారు. మూడో సారి మోడీ పిఎం అవుతారని, బీఆర్‌ఎస్‌ కథ ముగిసిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇక తెలంగాణ లో భవిష్యత్ బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్ ఒక్కటిగా గత ఎన్నికల్లో పని చేశాయని, వాళ్ళు ఏ ప్రచారం చేసినా ప్రజలు నమ్మరన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధి, అబద్ధాలకు మధ్య పోరు జరుగుతోందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడే బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్ లేదని ఆయన పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, ఇది కాంగ్రెస్ గెలుపు కాదని చురకలంటించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా దాట వేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు పొత్తుల వ్యవహారం ఊహించిందే.. ఎంతమంది కలిసినా జగన్‌ సింగిల్‌గానే..!

Exit mobile version