Site icon NTV Telugu

Kesineni Nani: పదవికే వన్నెతెచ్చే నేత వేపాడ చిరంజీవి

Kesineni Nani

Kesineni Nani

ఏపీలో ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు వేపాడ చిరంజీవి రావు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన వేంపాడ చిరంజీవి రావు సన్మానించారు బెజవాడ ఎంపీ కేశినేని నాని. ఈసందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. వేపాడ చిరంజీవి రావు వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఒక టీచర్ గా గ్రూప్1 ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే సుమారు యాభై వేలమంది యువతి యువకులకు విద్య అందించి వారి కల నిజం చేసిన వ్యక్తి చిరంజీవి అన్నారు నాని. చిరంజీవి లాంటి వ్యక్తుల అవసరం శాసన మండలికి, ప్రస్తుత సమాజానికి చాలా అవసరం ఉందన్నారు.

Read Also: KKR vs PBKS : తొలి వికెట్‌ను సమర్పించుకున్న కోల్‌కతా

ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం పార్టీకి శుభసూచకం. చిల్లర వ్యక్తులను పదవులిస్తే చట్ట సభల విలువలు దిగజారిపోతాయి.చిరంజీవి లాంటి మేధావులు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం వల్ల చట్ట సభల విలువ మరింత పెరుగుతుంది. ఎమ్మెల్సీ పదవికే వన్నె పెరుగుతుందన్నారు. ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన అభ్యర్ధిని ఎంపిక చేసిన చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలిపారు కేశినేని నాని.

 

రాష్ట్రానికి రౌడీలు కాదు.. మేధావులు కావాలి.సత్యకుమార్ పై వైసీపీ ఎంపీ అనుచరులు దాడి చేయడం దారుణం. విజయవాడ వెస్ట్ లో ఈసారి టీడీపీ గెలవబోతుంది. 2024లో ఖచ్చితంగా చంద్రబాబు సీఎం అవుతారు.వైజాగ్ లో రాజధాని అంటే అక్కడ వైసీపీని కాదని టీడీపీని గెలిపించారు. రాయలసీమలో కూడా టీడీపీని గెలిపించారు. మూడు రాజధానులు వద్దు.. అభివృద్ధి కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం పాతాళంలోకి వెళ్ళిపోయింది.దేశంలో ఏపీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా మారింది. 1982 కు ముందు హైదరాబాద్ లో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏపీలో ఉంది.కావాలని నలుగురు ఎమ్మెల్యే లను సస్పెండ్ చేశారు కానీ వేరే వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి ఉండవచ్చు అన్నారు ఎంపీ కేశినేని నాని.

Read Also: PM Modi: వందేభారత్ ట్రైన్ ప్రారంభించిన మోదీ.. కాంగ్రెస్‌పై “ఏప్రిల్ ఫూల్” కామెంట్స్..

Exit mobile version