NTV Telugu Site icon

MP K. Laxman : అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసిన నాయకుడు మోడీ..

Laxman

Laxman

అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసిన నాయకుడు మోడీ అని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు & ఎంపీ రాజ్యసభ డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ఆయన యాదాద్రి జిల్లాలో మాట్లాడుతూ.. మోడీ సరితూగే వ్యక్తి ఈ దేశంలో లేడని, లాల్ చౌక్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వేచ్ఛగా తిరిగేలా చేశారు మోడీ అని ఆయన కొనియాడారు. తూటాలతో ఉండే కాశ్మీర్ నేడు లక్షలాది మంది పర్యాటకుల సందడి నెలకొంది అంటే మోడీ కారణమని, బీఆర్ఎస్ వ్యతిరేకతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని లక్ష్మణ్‌ అన్నారు. గ్యారెంటీ లు, ఉచితల పేరు మీద మనం కట్టిన పన్నుల డబ్బులను వృధా చేస్తున్నారని, కేసీఆర్ వేల కోట్లు దోచుకొని రేవంత్ రెడ్డి కి చిప్ప చేతికి ఇస్తే ఆ చిప్ప పట్టుకొని పదహారు వేల కోట్లు అప్పు తెచ్చిడన్నారు లక్ష్మణ్‌. అంతేకాకుండా.. ఢిల్లీకి రెండు వేల కోట్ల రూపాయల కప్పం కట్టిన రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం, విద్యుత్ మీద జరిగిన అవినీతి పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలపడానికి మోడీ యాక్షన్ ప్లాన్ అని ఆయన అన్నారు.

నల్లగొండ బీజేపీ కార్యాలయంలో బీజేపీ నేత, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేసిందని ఆమె అన్నారు. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ఏమైందో కాంగ్రెస్ నేతలు చెప్పాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పాలనలో పాలనరాహిత్యం అవగాహన రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుందని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం లేదు.. గెలిపిస్తే ప్రయోజనం కూడా లేదన్నారు డీకే అరుణ. నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలు తెలిసిన ఏకైక వ్యక్తి బీజేపీ అభ్యర్థి అని, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి బిజెపి అభ్యర్థి విజయమే పరిష్కారమన్నారు డీకే అరుణ.