NTV Telugu Site icon

MP GVL Narasimha Rao: ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో భద్రతా సమస్యలు.. రైల్వేమంత్రికి ఎంపీ జీవీఎల్ లేఖ

Mp Gvl Narasimha Rao

Mp Gvl Narasimha Rao

MP GVL Narasimha Rao: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదంలో 15 మంది మృతిచెందారు.. 50 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.. అయితే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో భద్రతా సమస్యలపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేఖ రాశారు.. హౌరా-చెన్నై ప్రధాన లైన్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో రైలు భద్రతపై క్రమబద్ధమైన మరియు విస్తృత సమీక్షను కోరారు.. వాల్తేర్ రైల్వే డివిజన్‌లోని అలమండ మరియు కంటకపల్లె మధ్య విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో కనీసం 14 మంది మృతి చెందిన ఘోర రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లో కేవలం ఐదు నెలల వ్యవస్థలో రెండు పెద్ద రైలు ప్రమాదాలు సంభవించటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: Governor Tamilisai: కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై దాడి.. డీజీపీకి గవర్నర్‌ తమిళిసై కీలక ఆదేశాలు

ఇక, ఈ ఏడాది జూన్‌లో ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ కు జరిగిన ఘోర ప్రమాదంలో 280 మంది ప్రయాణికులు మరణం చెందిన విషయం గుర్తు చేస్తూ, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోని ప్రధాన హౌరా-చెన్నై లైన్‌ లోనే ఆ ప్రమాదం కూడా ప్రమాదం జరిగిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. విశాఖపట్నంలో నివసిస్తున్న పార్లమెంటు సభ్యునిగా మరియు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క జోనల్ రైల్వే యూజర్ కన్సల్టేటివ్ కమిటీ (ZRUCC) సభ్యునిగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో హౌరా-చెన్నై ప్రధాన మార్గంలో విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య రైళ్ల భద్రత గురించి నా తీవ్రమైన ఆందోళనను తెలియపరుస్తున్నాను అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తన లేఖ పేర్కొన్నారు. రైలు భద్రతపై సమీక్ష జరపాలని కోరుతూ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ‘‘ఐదు నెలల స్వల్ప వ్యవధిలో జరిగిన పై రెండు ప్రమాదాల దృష్ట్యా, రైలు భద్రతపై క్రమపద్ధతిలో, విస్తృత సమీక్ష చేయవలసిన అవసరం ఉందని, తద్వారా రైలు ప్రమాదాలు అరికట్టడమే కాకుండా ప్రయాణీకులకు భద్రతా భావాన్ని కలిగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిన్న జరిగిన రైలు ప్రమాదంలో క్షతగాత్రులను మరియు మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు తీసుకున్నందుకు రైల్వే మంత్రి మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణీకుల భద్రత మరియు భారతీయ రైల్వేలపై జాతీయ నమ్మకాన్ని నిలబెట్టే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశభావం వ్యక్తం చేశారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.