GVL Narasimha Rao: ప్రతి ఒక్క హిందువుని కల నెరవేరిన రోజు.. ఈ రోజు అని అభివర్ణించారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. జగదాననంద కారకుడు.. శ్రీ రాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మితమైన ఆలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో.. ఆయన మాట్లాడుతూ.. రామ మందిరం నిర్మించాలన్న ఐదున్నర శతాబ్దాల కల నెరవేరిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముని విగ్రహ ప్రతిష్ట చేయడం సంతోషంగా ఉందన్నారు.. దీంతో, ప్రతి ఒక్క హిందువు కల నెరవేరిన రోజు ఈరోజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీల సహకారం లేకపోవడం వలన దశాబ్దాల తరబడి.. కోర్టులో రామ జన్మభూమి కేసు నడిచిందని గుర్తుచేశారు. ఇక, ఈ నెలాఖరు నుంచి అయోధ్య వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారని తెలిపారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
Read Also: Ram Mandir Special: అంతా రామమయం.. సముద్ర గర్భంలోనూ శ్రీరాముడు..
కాగా, చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా కొన్ని క్షణాల్లే మిగిలి ఉన్నాయి.. రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య చేరుకున్నారు.. అంతే కాకుండా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అయోధ్య శ్రీ రామ నామ స్మరణతో కోలాహలంగా మారింది. అందమైన పువ్వులతో అయోధ్య వీధులను సుందరంగా అలకరించారు. వీధులు, ఫ్లైఓవర్లపై రాముడి బొమ్మలు చిత్రీకరించారు. అయోధ్య నగరం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతోంది.