NTV Telugu Site icon

C.M.Ramesh: అసాంఘీక కార్యక్రమాలు పేట్రేగిపోతున్నాయి.. కలెక్టర్, ఎస్పీలకు లేఖ

Cm Ramesh

Cm Ramesh

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని టార్గెట్ చేస్తూ అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్ నాయుడు లేఖ అస్త్రాన్ని సంధించారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అసాంఘిక కార్యక్రమాలు పేట్రేగిపోతున్నాయని వాటిని అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉందంటూ కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఎంపీ సిఎం రమేష్ నాయుడు లేఖలో కోరారు. దేవగుడి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జమ్మలమడుగు క్లబ్బులో ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు యథేచ్ఛగా పేకాట జరుగుతోందని ఆయన ఆరోపించారు.

Read Also: Naga Chaitanya: అసలైన బుజ్జి తల్లి శోభితే.. కానీ ఆ విషయంలో చాలా ఫీల్ అయింది!

మొత్తం 11 టేబుల్స్ ఉండగా ఒక్కొక్క టేబుల్కు 25 వేల నుంచి లక్ష రూపాయల వరకు బెట్టింగ్ జరుగుతున్నట్లు సిఎం రమేష్ పేర్కొన్నారు. అంతేకాకుండా జమ్మలమడుగు మండలంతో పాటు కడప జిల్లా సరిహద్దు ప్రాంతాలలో పేకాట, మట్కా, కల్తీ మద్యం వంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని.. వాటిని వెంటనే అరికట్టాలంటూ జిల్లా కలెక్టర్, ఎస్పీలను కోరారు. మహిళలను ఇబ్బందులకు గురి చేసే అసాంఘిక కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోనూ ప్రోత్సహించదని ఎంపీ సిఎం రమేష్ నాయుడు పేర్కొన్నారు. యువత జీవితాలతో ఆడుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Read Also: Ind vs Eng 5th T20: దంచికొట్టిన భారత్.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్