దూకుడు వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీనువైట్ల.. కానీ అదంతా గతం. మహేశ్ బాబు ఆగడు తో మొదలైన శ్రీనువైట్ల ప్లాపుల పరంపర గతేడాది వచ్చిన విశ్వంతో కూడా ఆగలేదు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ సినిమాలు ఇస్తూ వస్తున్నాడు శ్రీనువైట్ల. అయితే తాజాగా నితిన్ తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని, మైత్రి మూవీస్ ఈ సినిమాను నిర్మిస్తోంది టాక్ వినిపించింది. శ్రీను వైట్ల కథ కాకుండా సమజవరాగమనకు పనిచేసిన నందు కథతో ఈ సినిమా చేస్తున్నారని ఇటీవల టాక్ వినిపించింది.
అయితే ఈ కథ మొదట యంగ్ హీరో నితిన్ వద్దకు వెళ్లిందట. శ్రీను వైట్ల చెప్పిన పాయింట్ నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు నితిన్ మొదట అంగీకరించాడు. కానీ అనుకోని కారణాల వలన నితిన్ ఈ సినిమా నుండి బ్యాక్ స్టెప్ వేసాడు. దాంతో ఈ కథ నితిన్ దగ్గర నుండి మరొక యంగ్ హీరో శర్వానంద్ దగ్గరకు చేరింది. శర్వానంద్ ను కు కథ వినిపించగా వెంటనే ఒకే చేసేసాడాడట. ప్రస్తుతం శర్వా నారి నారి నడుమ మురారి, తో పాటు మరో రెండు సినిమాలలో నటిస్తున్నాడు. ఆ సినిమాలు ఫినిష్ చేసి శ్రీను వైట్లతో సినిమాను సెట్స్ తీసుకెళ్తాడేమో చూడాలి. ఇటీవల నిర్మాణ సంస్థను స్టార్ట్ చేసిన శర్వానంద్ నిర్మాణంలో ఈ సినిమా వస్తుందా లేదా ముందునుండి అనుకున్నట్టు మైత్రి మూవీస్ ఈ సినిమాస్ నిర్మిస్తుందా చూడాలి. శ్రీనువైట్ల – శర్వానంద్ సినిమాకు మరికొద్ది రోజుల్లో అఫిషీయల్ గా ప్రకటన రాబోతుంది.
