Site icon NTV Telugu

Rare Wild Cat : ఎవరెస్టు శిఖరంపై అత్యంత అరుదైన పల్లాస్‌ పిల్లులు

Cat

Cat

Rare Wild Cat : ఎవరెస్టు శిఖరం.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ఈ శిఖరానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌పై అరుదైన పల్లాస్‌ పిల్లులు జీవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పల్లాస్ క్యాట్స్ గా పిలవడే ఈ అడవి పిల్లుల ఉనికి ఎవరెస్టు శిఖరంపై కనిపించడం ఇదే తొలిపారి అని పేర్కొన్నారు. సాధారణంగా గ్రామల్లో కనిపించే పిల్లుల కంటే అడవి పిల్లులు కొంచెం పెద్దగా, బలంగా కనిపిస్తాయి. అయితే పల్లాస్ క్యాట్స్ కూడా అడవి పిల్లులే కానీ అవి గ్రామాల్లో పిల్లుల కంటే కూడా చిన్నవిగా ఉంటాయి. 2019లో పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ట్రాసీ సీమన్‌ ఆధ్వర్యంలో ఎవరెస్టు పై గల సాగర్‌మాతా జాతీయ పార్కులో పరశోధనలు చేపట్టారు. పర్యావరణ నమూనాలు సేకరించారు.

Read Also: Gunfire In USA : అమెరికాలో మరోమారు పేలిన గన్.. ముగ్గురు స్పాట్ డెడ్

జన్యు విశ్లేషణ జరపగా పల్లాస్‌ పిల్లులు ఎవరెస్టుపై జీవిస్తున్నాయని గుర్తించారు. ఈ పల్లాస్ క్యాట్స్ నే మనూల్ లు అని కూడా పిలుస్తారు. ఈ పిల్లులను భూమిపైనే తొలిసారిగా 1776లో బైకాల్ సరస్సు పరిసరాల్లో పీటర్ సైమన్ పల్లాస్ అనే జంతు శాస్త్రవేత్త గుర్తించడం వల్ల వీటికి పల్లాస్ క్యాట్స్ అనే పేరు వచ్చింది. అవి పరిసరాలను బట్టి గ్రే, బూడిత, బూడిత ఎరుపు రంగుల్లో ఉంటాయి. తలకు ఇరువైపుల చెవులు పొట్టిగా, గుండ్రంగా ఉంటాయి. తోక 20 నుంచి 30 సెం.మీ పొడవులో ఉంటుంది. ఈ జాతి పిల్లుల కాళ్లు పొట్టిగా ఉంటాయి. వీపు భాగంలో ఉండే వెంట్రుకల కంటే ఉదర భాగంలో ఉండే వెంట్రుకలు చల్లటి ప్రదేశాల్లో నివసించే ఈ పిల్లులను చలి తీవ్రత నుంచి కాపాడేందుకు ఈ పొడవాటి వెంట్రుకలు తోడ్పడుతాయి.

Read Also: America Chaina War: వచ్చే రెండేళ్లలో చైనాతో అమెరికా యుద్ధం

Exit mobile version