Site icon NTV Telugu

Moto Book 60 Laptop: 14-అంగుళాల డిస్ప్లే, ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్తో విడుదలకు సిద్దమైన మోటో బుక్ 60

Moto 60

Moto 60

Moto Book 60 Laptop: ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మోటరోలా భారత మార్కెట్‌లో తన ఉత్పత్తులను విస్తరిస్తూ సరికొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే తన స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్లు ద్వారా విశేష ప్రేక్షకాదరణ పొందిన మోటరోలా.. ఇప్పుడు మోటో బుక్ 60 ల్యాప్‌టాప్‌ను ఏప్రిల్ 17, 2025న అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో దీని ప్రత్యేక లాంచ్ పేజీ లైవ్‌ అయినట్లు కంపెనీ వెల్లడించింది.

Read Also: Moto Pad 60 Pro: 12.7-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్, 3K రిజల్యూషన్తో వచ్చేస్తున్న మోటో ప్యాడ్ 60 ప్రో ట్యాబ్లెట్

ఇక విడుదల కాబోతున్న మోటో బుక్ 60 ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ మోటో బుక్ 60 ల్యాప్‌టాప్‌ను మోటరోలా లైట్‌వెయిట్ డిజైన్‌తో రూపొందించింది. దీని బరువు కేవలం 1.4 కిలోలు మాత్రమే. ఇది బ్రోన్జ్ గ్రీన్, వెడ్జ్ వుడ్ అనే రెండు ప్రత్యేక పాన్ టోన్ కరెక్టెడ్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. మోటరోలా దీనిని “All-New Mood With All-New Hues” అనే థీమ్‌తో లాంచ్ చేయనుంది.

ఈ ల్యాప్‌టాప్‌లో 14 అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే ఉంది. ఇది 500 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. తద్వారా మల్టీమీడియా అనుభవం మరింత రిచ్‌గా ఉండనుంది. ఆడియో పరంగా, ఈ ల్యాప్‌టాప్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇవి డాల్బీ ఆటమ్స్ టెక్నాలజీ ద్వారా మరింత మెరుగైన సౌండ్ అనుభూతిని అందిస్తాయి. ఇక ఈ మోటో బుక్ 60 లో ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది శక్తివంతమైన పనితీరును అందించగలదు. బ్యాటరీ పరంగా చూస్తే ఇది 60Wh సామర్థ్యంతో వస్తోంది. అలాగే ఇది 65W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది.

ఈ ల్యాప్‌టాప్‌లో స్మార్ట్ కనెక్ట్ అనే ఫీచర్ ఉంది. ఇది ఇతర మోటరోలా పరికరాలతో అంటే ట్యాబ్లెట్, స్మార్ట్‌ఫోన్‌లను అనుసంధానం కావడానికి సహాయపడుతుంది. స్మార్ట్ క్లిప్ బోర్డు ద్వారా ల్యాప్‌టాప్, ఫోన్ లేదా ట్యాబ్లెట్ మధ్య కంటెంట్‌ను కాపీ/పేస్ట్ చేయడం ఎంతో సులభంగా మారుతుంది. ఫైల్ ట్రాన్స్ఫర్ ఫీచర్ ద్వారా డివైస్‌ల మధ్య ఫైల్స్‌ను వేగంగా షేర్ చేయవచ్చు. మోటో బుక్ 60 ల్యాప్‌టాప్‌ ఫ్లిప్ కార్ట్ లో ఎక్స్‌క్లూజివ్‌గా లభించనుంది. ధర, ఇతర పూర్తి వివరాలు విడుదల రోజున తెలియనున్నాయి.

Exit mobile version