Motorola Razr 50 Ultra Price In India: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘మోటోరొలా’ గతేడాది రేజర్ 40, రేజర్ 40 అల్ట్రా పేరుతో రెండు ఫ్లిప్‌ఫోన్‌లను భారత మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. రేజర్ సిరీస్‌లో భాగంగా ‘రేజర్ 50 అల్ట్రా’ను తీసుకొస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ జూన్ 25న చైనాలో విడుదల కానుంది. అమెజాన్ కేటగిరీ పేజీ ప్రకారం.. జూన్ 25నే భారతదేశంలో లాంచ్ కానుందని తెలుస్తోంది. రిలీజ్‌కు ముందే రేజర్ 50 అల్ట్రా ఫీచర్స్ బయటికొచ్చాయి. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో మోటోరొలా రేజర్ 50 అల్ట్రా ఫోన్ రానుందట. అడాప్టివ్ స్టెబిలైజేషన్, యాక్షన్ షాట్, ఇంటెలిజెంట్ ఆటో ఫోకస్ ట్రాకింగ్, ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ ప్రో, సూపర్ జూమ్, కలర్ ఆప్టిమైజేషన్, స్టైల్ సింక్, ఏఐ మ్యాజిక్ కాన్వాస్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 3.6 ఇంచెస్ కవర్ స్క్రీన్ ఉండగా.. 6.9 ఇంచెస్ ఇన్నర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్ ఉండనుంది. 12జీబీ+256జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉండనుంది.
Also Read: Irfan Pathan: అతడు టీమిండియాకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లాంటోడు!
మోటోరొలా రేజర్ 50 అల్ట్రా ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50 ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. ఈ ఫోన్ 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రావచ్చు. మోటోరొలా హలో యూఐతో సరికొత్త ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రావొచ్చు. రేపు ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలియరానున్నాయి. లాంచ్ తర్వాత అమెజాన్‌లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. రేజర్ 50 అల్ట్రా 12జీబీ+256జీబీ వేరియంట్ ధర లక్ష (రూ.107,310) పైనే ఉండనుంది.