Site icon NTV Telugu

Moto Book 60: మోటరోలా నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే

Moto

Moto

మోటరోలా నుంచి ఫస్ట్ ల్యాప్‌టాప్ విడుదలైంది. మోటరోలా తన మోటో బుక్ 60 ల్యాప్‌టాప్‌ను భారత్ లో రిలీజ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్ 14-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 60Wh బ్యాటరీతో రెండు కలర్స్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీనిని ఇంటెల్ కోర్ 7 240H ప్రాసెసర్‌తో 32GB వరకు RAM, 1TB వరకు స్టోరేజ్ తో కాన్ఫిగర్ చేయవచ్చు.

Also Read:MI vs SRH : మరోసారి రాణించిన అభిషేక్ శర్మ.. ముంబై టార్గెట్ ఎంతంటే?

ఇంటెల్ కోర్ 5 సిరీస్ ప్రాసెసర్‌తో కూడిన మోటో బుక్ 60 16GB RAM + 512GB వెర్షన్ ధర రూ.69,999. ఈ మోడల్‌ను రూ. 61,999 ప్రత్యేక లాంచ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇంటెల్ కోర్ 7 సిరీస్ ప్రాసెసర్‌తో కూడిన 16GB + 512GB, 16GB + 1TB వేరియంట్ల ధర వరుసగా రూ. 74,990, రూ. 78,990. లాంచ్ డిస్కౌంట్లతో, వీటిని రూ. 73,999 (512GB), రూ. 73,999 (1TB) ధరలకు కొనుగోలు చేయవచ్చు. మోటరోలా ప్రవేశపెట్టనున్న తొలి ల్యాప్‌టాప్ ఏప్రిల్ 23న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ లో సేల్ ప్రారంభమవుతుంది.

Also Read:Deputy CM Pawan Kalyan: వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి.. పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు..

మోటో బుక్ 60 స్పెసిఫికేషన్లు

మోటో బుక్ 60 విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ పై పనిచేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 14-అంగుళాల 2.8K (1,800×2,880 పిక్సెల్స్) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే డాల్బీ విజన్, HDR సపోర్ట్‌ను కలిగి ఉంది. TÜV రీన్‌ల్యాండ్ లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ సర్టిఫికేషన్‌తో వస్తుంది. దీనికి బటన్‌లెస్ మైలార్ టచ్‌ప్యాడ్ ఉంది. ఇది ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ గ్రాఫిక్స్‌తో ఇంటెల్ కోర్ 7 240H, ఇంటెల్ కోర్ 5 210H ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 32GB వరకు DDR5 RAM, గరిష్టంగా 1TB PCIe 4.0 SSD స్టోరేజ్ ను కలిగి ఉంది. మోటో బుక్ 60 లో వినియోగదారులు ప్రైవసీ షట్టర్‌తో కూడిన 1080p వెబ్‌క్యామ్, విండోస్ హలో ఫేస్ రికగ్నిషన్ కోసం IR కెమెరాను అమర్చారు.

Also Read:Minister Ponmudy: ఆ మంత్రిపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం..

ఇది మిలిటరీ-గ్రేడ్ (MIL-STD-810H) క్వాలిటిని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో డాల్బీ అట్మాస్, 2W ఆడియో అవుట్‌పుట్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.4, Wi-Fi 7 లను కలిగి ఉంది. మోటో బుక్ 60లో రెండు USB టైప్-A 3.2 Gen 1 పోర్ట్‌లు, రెండు USB టైప్-C 3.2 Gen 1 పోర్ట్‌లు, ఒక డిస్ప్లేపోర్ట్ 1.4, ఒక HDMI పోర్ట్, ఒక మైక్రో SD కార్డ్ స్లాట్, 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లో అనేక AI- ఆధారిత ఫీచర్స్ ఉన్నాయి. మోటో బుక్ 60 65W ఛార్జింగ్ సపోర్ట్‌తో 60Wh బ్యాటరీని ప్యాక్ తో వస్తుంది.

Exit mobile version