NTV Telugu Site icon

Motorola Edge 50 Pro Price: భారత్‌లో ‘మోటో ఎడ్జ్‌ 50 ప్రో’ లాంచ్.. సూపర్ లుక్‌, అద్భుత ఫీచర్స్!

Motorola Edge 50 Pro

Motorola Edge 50 Pro

Motorola Edge 50 Pro 5G Smartphone Launch and Price: భారత్‌లో ‘మోటోరొలా’ మొబైల్‌ కంపెనీకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసిన మోటోరొలా.. ఆ మధ్య కాస్త వెనకపడిపోయింది. అయితే ఎడ్జ్‌ సిరీస్‌తో మళ్లీ పూర్వవైభవం వచ్చింది. ముఖ్యంగా మోటోరొలా ఎడ్జ్‌ 40, మోటోరొలా ఎడ్జ్‌ నియో స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్‌ను షేక్ చేశాయి. దాంతో ఎడ్జ్‌ సిరీస్‌లో ‘మోటో ఎడ్జ్‌ 50 ప్రో’ను కంపెనీ బుధవారం (ఏప్రిల్ 3) భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. సూపర్ లుక్‌, అద్భుత ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మోటో ఎడ్జ్‌ 50 ప్రో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Motorola Edge 50 Pro Price:
ఏప్రిల్‌ 9 నుంచి మోటో ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ఆరంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, మోటో ఆన్‌లైన్‌ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.31,999గా ఉండగా.. 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.35,999గా ఉంది. అయితే ప్రారంభ ఆఫర్‌ కింద రూ.27,999, రూ.31,999కు విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. కార్డు ఆఫర్స్, ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ ఉన్నాయి. బ్లాక్‌ బ్యూటీ, లక్స్‌ లావెండర్‌, మూన్‌లైట్‌ పెర్ల్‌ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

Motorola Edge 50 Pro Specs:
మోటో ఎడ్జ్‌ 50 ప్రోలో 6.7 అంగుళాల 1.5K పీఓఎల్‌ఈడీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఇది 144Hz రిఫ్రెష్‌ రేటుకు సపోర్ట్‌ చేస్తుండగా.. 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హెలో యూఐతో ఇది వస్తోంది. ఆండ్రాయిడ్‌ 17 వరకు అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ పేర్కొంది.

Also Read: OnePlus Nord CE4 Launch: నేడు మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4’.. ధర, ఫీచర్లు ఇవే!

Motorola Edge 50 Pro Camera and Battery:
మోటో ఎడ్జ్‌ 50 ప్రోలో వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో వస్తోంది. 13 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 10 టెలిఫొటో లెన్స్‌ ఇందులో అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీ కెమెరా ఉంది. ఎడ్జ్‌ 50 ప్రోలో 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. ఇది 125W వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు, 50W వైర్‌లెస్‌ టర్బో ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 12జీబీ వేరియంట్‌లో మాత్రమే 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఇస్తున్నారు. బేస్‌ వేరియంట్‌లో 68W ఫాస్ట్‌ ఛార్జర్‌ ఉంటుంది.