Motorola Edge 50 5G Smartphone Launch and Price in India: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలా వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎడ్జ్ సిరీస్‌లో సరికొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. ఈ క్రమంలో మరో స్టన్నింగ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ‘మోటోరొలా ఎడ్జ్ 50’ పేరుతో రిలీజ్ అవుతోంది. ఆగష్టు 1న మధ్యాహ్నం 12 గంటలకు ఎడ్జ్ 50 లాంచ్ అవుతుంది. మోటోరొలా స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్‌లలో ఈ ఫోన్స్ అందుబాటులో ఉండనున్నాయి.
మోటోరొలా ఎడ్జ్ 50 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌తో వస్తోంది. ఇందులో ఐపీ (ఇంగ్రెస్ ప్రొటెక్షన్)68ని ఇస్తున్నారు. ఐపీ68 మీ గ్యాడ్జెట్‌లోకి దుమ్మూ, నీరు చేరకుండా నిరోధిస్తుంది. ఒకటిన్నర మీటరు లోతులో 30 నిమిషాల పాటు ఉన్నా.. ఎడ్జ్ 50 స్మార్ట్‌ఫోన్‌లోకి నీరు చేరకుండా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఎడ్జ్ 50 మూడు వేరియంట్లలో, మూడు కలర్ ఆప్షన్‌లలో లభించనుంది. ఈ ఫోన్ ధర రూ.25 పైనే ఉంటుందని తెలుస్తోంది. వరల్డ్ స్లిమ్మెస్ట్ ఫోన్ ఇదే అట. ఆగష్టు 1న పూర్తి వివరాలు తెలియరానున్నాయి.
Also Read: Charith Asalanka: వాతావరణం కూడా మాతో ఆడుకుంది: శ్రీలంక కెప్టెన్
మోటోరొలా ఎడ్జ్ 50 స్పెసిఫికేషన్స్:
# 6.67 ఫోఎల్‌ఈడీ డిస్‌ప్లే
# 1900 నిట్స్ హెచ్‌డీఆర్ పీక్ బ్రైట్‌నెస్
# సోనీ లిటియా 700సీ కెమెరా (50 MP f/1.8, 13 MP f/2.2, 10 MP f/2.0)
# 32 ఎంపీ సెల్ఫీ కెమెరా (32 MP f/2.4)
# 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ (30 గంటలకు పైగా బ్యాటరీ వస్తుంది)
# 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జర్ (68 వాట్స్ టర్బో పవర్ ఛార్జర్)