Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సరీ-డెల్టా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ మోటార్‌సైకిల్ ట్రాఫిక్ సిగ్నల్ పైకి ఎగిరి వేలాడుతూ కనిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ప్రమాదంలో బైక్ రైడర్ తీవ్రంగా గాయపడగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పోలీసుల సమాచారం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్కాట్ రోడ్, 72వ అవెన్యూ, 120వ స్ట్రీట్ జంక్షన్ వద్ద కారు-బైక్ ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మోటార్‌సైకిల్ గాల్లోకి ఎగిరి ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కు చిక్కుకుని వేలాడుతూ నిలిచిపోయింది.
ఈ విచిత్ర దృశ్యానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోడ్డుపై ప్రయాణిస్తున్నవారు ఒక్కసారిగా ఆగి పైకి వేలాడుతున్న బైక్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకుని బైక్‌ను కిందికి దించే ప్రయత్నాలు చేపట్టారు. ఇక ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికుడు విలియం చాన్ మాట్లాడుతూ.. మొదట రోడ్డుమధ్యలో ధ్వంసమైన కారును చూశానని, తర్వాత పైకి చూసి ట్రాఫిక్ సిగ్నల్‌కు వేలాడుతున్న బైక్‌ను చూసి షాక్ అయ్యానని తెలిపాడు.
Also Read
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
డెల్టా పోలీస్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. బైక్ రైడర్‌కు తీవ్ర గాయాలు అయినప్పటికీ ప్రాణాపాయం లేదని వెల్లడించారు. కారులో ఉన్న డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాదం తర్వాత స్కాట్ రోడ్‌ను 70వ అవెన్యూ నుంచి 72వ అవెన్యూ వరకు పూర్తిగా మూసివేశారు. రోడ్డుపై పడిన శిథిలాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు గంటల పాటు శ్రమించారు. ఇక వీడియోలు, ఫోటోలు చూసిన వారు అసలు ఆ బైకు అంత ఎత్తులో నిలబెట్టావ్ బాస్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
NEW: Motorcycle ends up dangling from a traffic signal pole following a crash in Canada near the Surrey-Delta border.
The bike appeared to launch into the air at the light after colliding with the front end of a BMW in an intersection.
According to police, the rider… pic.twitter.com/xalFUvnK68
— Collin Rugg (@CollinRugg) May 10, 2026
Here's the footage. pic.twitter.com/dvLrJYqdke
— Action 🎲 Jaxon (@the1Jax) May 10, 2026
తాజావార్తలు
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!