Moto G96 5G: మోటరోలా కంపెనీ తన G సిరీస్‌లో మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో G96 5G పేరుతో విడుదలైన ఈ ఫోన్ ఫీచర్లు, ధరను చూస్తే మిడ్‌రేంజ్‌లో బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. జూలై 16 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా, అలాగే అధికారిక రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. మరి ఈ పవర్‌ఫుల్ ఫీచర్ల మొబైల్ గురించి పూర్తి వివరాలను చూసేద్దామా..
డిస్ప్లే:
Moto G96 5Gలో 6.67 అంగుళాల FHD+ pOLED 3D కర్వుడ్ స్క్రీన్ ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 10-bit కలర్ సపోర్ట్ వంటి ప్రత్యేకతలతో డిస్ప్లే పరంగా మంచి అనుభూతిని అందించనుంది. స్క్రీన్ ముందు భాగాన్ని Corning Gorilla Glass 5 రక్షిస్తుంది.
Read Also:Drug Rocket: మహిళల హైహీల్స్‌లో డ్రగ్స్.. భారీగా డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేసిన ఈగల్ టీం..!
ప్రాసెసర్:
ఈ ఫోన్‌లో Snapdragon 7s Gen 2 (4nm) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనితో పాటు 8GB LPDDR4X RAM, 128GB / 256GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతుంది. ఈ మొబైల్ కు 3 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందనున్నాయి.
కెమెరా:
Moto G96 5Gలో 50MP ప్రధాన కెమెరా (Sony LYT-700C సెన్సార్, OIS సపోర్ట్), 8MP అల్ట్రావైడ్ + మాక్రో కెమెరా, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాతో ఫోటోగ్రఫీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యం ఈ ఫోన్‌కు ప్రత్యేక విషయం.
బ్యాటరీ:
ఈ కొత్త మొబైల్లో 5500mAh బ్యాటరీ ఉంది. దీనికి 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. త్వరగా ఛార్జ్ అయ్యే ఈ ఫోన్, రోజంతా ఉపయోగించడానికి సరిపోతుంది.
ధర:
Moto G96 5G భారత మార్కెట్లో రెండు వేరియంట్లలో లభిస్తోంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 17,999గా నిర్ణయించగా, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, మోటోరోలా తోపాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో జూలై 16 నుంచి అందుబాటులో ఉంటుంది.
ఇతర ముఖ్య ఫీచర్లు:
IP68 రేటింగ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, Dual 5G సపోర్ట్, Wi-Fi 6, Dolby Atmos స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఈ మొబైల్ పాంటోన్ గ్రీనర్ పాస్టర్స్, కాట్లేయ ఆర్చిడ్, ఆశ్లేఇఘ్ బ్లూ, డ్రేస్డెన్ బ్లూ అనే రంగులలో లభ్యమవుతుంది. మొత్తంగా చెప్పాలంటే, Moto G96 5G ప్రీమియం లుక్స్, పవర్‌ఫుల్ ఫీచర్లతో ఉన్నప్పటికీ, ధర పరంగా కాస్త ఎక్కువగా కనపడుతుంది.
