Site icon NTV Telugu

Moto g35 5G: 10 వేల కంటే తక్కువ ధరలో చౌకైన ఫోన్ ను తీసుకొచ్చేస్తున్న మోటోరోలా

Moto G35 5g

Moto G35 5g

Moto g35 5G: తక్కువ ధరలో గొప్ప ఫీచర్లు కలిగిన 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకు శుభవార్త. మోటోరోలా తన కొత్త 5G ఫోన్ Moto G35 ను విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపే ఉండడం విశేషం. ఇది 5G బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుందని, ఈ సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన 5G ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ర్యామ్ బూస్ట్ ఫీచర్ ద్వారా ఫోన్ 12 జీబీ ర్యామ్‌ను పొందుపరచవచ్చు. ఇది 50-మెగాపిక్సెల్ ప్రధాన వెనుక కెమెరాతో 5000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. వేగన్ లెదర్ ఫినిషింగ్ ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఇవ్వబడింది.

Also Read: OnePlus Ace 5 Series: 1TB స్టోరేజ్‌తో రెండు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతున్న వన్‌ప్లస్

ఈ ఫోన్ 4GB RAM, 128GB స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో విడుదల చేయబడింది. దీని ధర రూ. 9,999. ఫోన్ మొదటి సేల్ డిసెంబర్ 16 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫ్లిప్కార్ట్, కంపెనీ అధికారిక సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. గువా రెడ్, లీఫ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్స్‌లో ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. మోటో G35 5G స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల పూర్తి HD ప్లస్ డిస్‌ప్లేతో 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. డిస్ప్లే విజన్ బూస్టర్, నైట్ విజన్ మోడ్ సపోర్ట్‌తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణను కలిగి ఉంది. ఫోన్ Unisock T760 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇక ర్యామ్ బెస్ట్ ఫీచర్‌తో ర్యామ్ ను ఇంకా 8GB వరకు పెంచవచ్చు. దాంతో మొత్తం RAMని 12GBకి పెంచవచ్చు. ఫోన్ బెస్ట్ హలో UIతో Android 14తో రన్ అవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌లో రెండేళ్లపాటు ఒక OS అప్‌గ్రేడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ప్రధాన వెనుక కెమెరా 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో USB టైప్-సి పోర్ట్, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉంది. ఫోన్ దుమ్ము, నీటి నుండి సురక్షితంగా ఉండటానికి IP52 రేటింగ్‌తో వస్తుంది. ఇక మంచి సౌండ్ సిస్టం కోసం ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో డ్యూయల్ స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది. Moto G35 థింక్‌షీల్డ్ రక్షణతో వస్తుంది.

Also Read: KTR: ఆశా వర్కర్లపై దాడి చేసిన పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించాలి.. కేటీఆర్ డిమాండ్

ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కూడా ఇందులో ఉంది. ఇది యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, SAR సెన్సార్ ఇంకా ఇ-కంపాస్ సెన్సార్‌లను కూడా కలిగి ఉంది. ఫోన్‌లో అందుబాటులో ఉన్న కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, A-GPS, LTEPP, GLONASS, గెలీలియో, QZSS ఇంకా 3.5 mm ఆడియో జాక్ ఉన్నాయి. ఫోన్ కొలతల పరంగా.. 166.29×75.98×7.79 మిమీ. ఉండగా.. ఫోన్ మందం 7.79 మి.మీ. ఉంది. ఫోన్ 185 గ్రాముల బరువు ఉంటుంది.

Exit mobile version