రాను రాను మనుషులలో కొంత క్రూరత్వం మరింతగా పెరిగిపోతుంది. భూమ్మీద ఎలాంటి స్వార్థం కాకుండా ఒక మనిషిని ప్రేమించగలగేది వారి తల్లి మాత్రం ఒక్కటే అని సులువుగా చెప్పవచ్చు. తల్లికి తన భర్త తోడు ఉన్న లేకున్నా తన పిల్లల్ని మాత్రం ఎంతో బాధ్యతగా పెంచి వారిని ప్రయోజకులను చేస్తుంది. కన్నతల్లి చూపించే ప్రేమ ముందర ఎన్ని కపట ప్రేమలు వచ్చిన తక్కువే. అయితే తల్లి అంత ప్రేమ చూపించిన వారి పుత్రులు మాత్రం ఆమెపై అదే ప్రేమను చూపిస్తారా అంటే దానికి మాత్రం గ్యారెంటీ లేదు. పెళ్లి అయ్యేంతవరకు ఒకలా ఉన్న కొడుకులు.. ఆ తర్వాత కొందరు అమ్మను దూరం పెట్టి నరకయాతనాలు వారికి చూపిస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులకు అన్నం పెట్టడానికి కూడా చేతులు రావట్లేదు. కొందరైతే తల్లిదండ్రులు వృద్ధులు అని చూడకుండా వారిపై దాడులకు కూడా తెగబడుతున్నారు. ముఖ్యంగా ఆస్తి తగాదాలకు సంబంధించిన విషయాల్లో., అలాగే భార్యకు సంబంధించిన విషయాల్లో ఈ సంఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇకపోతే తాజాగా ఇద్దరు వ్యక్తుల భార్యల కోసం వారి సొంత తల్లిని చంపేసిన వైనం ప్రస్తుతం అందరిని ఆగ్రహనికి గురి చేసేలా చేస్తుంది. కన్నతల్లిని కొట్టి చంపుతుంటే కొడుకులు చూస్తూ నిలబడ్డం తప్ప అడ్డగించకపోవడం కాకుండా.. వేరే వారిని ప్రోత్సహించడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓకే తన కన్నతల్లిని సొంత భార్య, అలాగే వదినలు కొట్టి చంపుతుంటే.. ఆ వ్యక్తి మాత్రం చూస్తూ నిలబడిపోయినా సంఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని గ్వాలియర్ జిల్లాలో మున్ని దేవి అనే మహిళపై ఇద్దరు కోడళ్లు తీవ్రంగా కొట్టడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ ఆమె కోలుకోలేక మృతి చెందింది.
కోడలు అత్తపై దాడి చేస్తున్న సమయంలో తీసిన వీడియో వైరల్ కావడంతో ప్రస్తుతం పోలీసులు దానిపై స్పందించారు. ఇక ఈ కేసు విషయంలో మున్ని దేవి ఇద్దరు కోడలు, పెద్ద కుమారుడు, చిన్న కోడలు తండ్రి, చిన్న కొడుకు పై కేసు నమోదు చేశారు. ఇందులో మొత్తం ఆరు మంది పై కేసు పెట్టగా ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు మరో పరారీలో ఉన్న ముగ్గురు వ్యక్తులను వెతికే పనిలో పడ్డారు. ఈ సంఘటన వారం రోజుల క్రితం జరిగిన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
