Site icon NTV Telugu

Illicit Affair: తల్లి, కుమారుడి దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

Murder

Murder

Illicit Affair: వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని తలకిందులు చేసింది. వివాహేతర సంబంధమే కారణంగా మహిళా, ఆమె కుమారుడు హత్యకు గురయ్యారు. ఈ విషాదకర ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుని సంచలనం రేపుతోంది. ఈ హత్యలు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, మెదక్‌లలో జరిగాయి. కేసును విచారిస్తున్న కృష్ణా జిల్లా పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ హత్యలకు సంబంధించిన పుర్తి వివరాలలోకి వెళితే..

పోచమ్మ అనే మహిళ మామిడి గోపాల్ అనే వ్యక్తితో కలిసి జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో రహస్యంగా ఆమెను, ఆమె కుమారుడు మహేష్‌ను హత్య చేయాలని నిందితులు నిర్ణయించుకున్నారు నిందితులు. మెదక్ జిల్లాకు చెందిన పోచమ్మ అనే మహిళను కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యనమల కుదురు ప్రాంతంలో నిందితులు దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఈ హత్యపై కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

అరెస్టు అనంతరం విచారణలో, నిందితులు పోచమ్మ కుమారుడు మహేష్‌ను కూడా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. మహేష్‌ను మెదక్ జిల్లా పరిధిలో హత్య చేసి మృతదేహాన్ని దాచినట్టు వారు వెల్లడించారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. మహేష్ మృతదేహన్ని హత్య జరిగిన 28 రోజుల తర్వాత వెలికితీసారు. ఈ దారుణ హత్యల కేసులో నిందితులుగా బండి శోభ, మామిడి గోపాల్‌లను పోలీసులు ఆరెస్ట్ చేసారు. ప్రస్తుతం కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

Exit mobile version