Site icon NTV Telugu

Vijayawada Crime: కన్న కొడుకుని చంపిన తల్లి.. సహకరించిన చెల్లి

Amberpet Crime

Amberpet Crime

Vijayawada Crime: తన పిల్లల కోసం తల్లి ఏమైనా చేస్తుంది.. వారు తప్పుచేసినా.. కడుపులోపెట్టుకు చూసుకుంటుంది.. అదే దారి తప్పితే.. నిత్యం వేధింపులకు గురి చేస్తే.. ఎంత కాలం భరిస్తుంది..? అయితే, కోపం వస్తే ఎంతటి దారుణానికైనా వెనుకాడని ఘటనలు కూడా వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, విజయవాడలో దారి తప్పిన కొడుకు.. నిత్యం వేధింపులకు గురిచేస్తుంటే.. తట్టుకోలేక కన్న కొడుకునే హత్య చేసింది ఓ తల్లి.. ఆ హత్యకు ఆ తల్లి కూతురు, మృతుడి చెల్లి సహకరించింది.

Read Also: TS Rains: తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరికలు

విజయవాడలో సంచలనంగా మారిన ఓ హత్యకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెడు అలవాట్లకు బానిసైపోయిన ఓ యువకుడు.. నిత్యం ఇంటికి వచ్చి తల్లిని వేధింపులకు గురిచేసేవాడు.. మద్యం, గంజాయికి బానిసగామారి.. డబ్బుల కోసం తల్లిని పీల్చుకుతినేవాడు.. అయితే, నిత్యం ఇదే తంతు కొనసాగుతుండడంతో.. కన్న కొడుకు అనే విషయాన్ని కూడా ఆ వేధింపులు మర్చిపోయేలా చేశాయి.. కాళికగా మారిన ఆ తల్లి.. కన్న కొడుకుని చంపేసింది.. ఈ ఘటనకు మృతుడి చెల్లి కూడా సహకరించింది.. అయితే, ఈ వ్యవహారం ఆలస్యంగా పోస్టు మార్టం నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది.. మద్యం, గంజాయి బానిసగా మారిన దేవ్ కుమార్ ను తల్లి మాధవి హత్య చేయగా.. ఆమె దేవ్‌కుమార్‌ చెల్లితో పాటు.. అలీఖాన్‌ అనే మరో వ్యక్తి సహకరించారు.. పీక నొక్కి శ్వాస ఆడకుండా చేసి హత్య చేశారు.. అయితే, తాము పనికి వెళ్లి వచ్చే సరికి చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి.. మొదట అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత.. దర్యాప్తులో హత్యగా గుర్తించారు పోలీసులు. మృతుడి తల్లి, చెల్లి సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్‌ చేశారు పోలీసులు.

Exit mobile version