భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ జాడపై కీలక సమాచారం బయటకు వచ్చింది. ఓ జాతీయ మీడియా ఈ సమాచారాన్ని అందించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో మసూద్ అజార్ కీలక స్థావరం బహవల్పూర్ ఉంది.. ఈ ప్రాంతానికి దాదాపు 1,000 కి.మీ దూరంలో ఈ ఉగ్రవాది ఉన్నట్లు తెలుస్తోంది. బహవల్పూర్ బురుజుకు 1,000 కి.మీ దూరంలో ఉన్న పీఓకేలో మసూద్ అజార్ కనిపించాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. కాగా.. అజార్ ఇటీవల స్కార్డులోని సద్పారా రోడ్ ప్రాంతంలో కనిపించాడు. ఈ ప్రాంతంలో కనీసం రెండు మసీదులు, మదర్సాలు, బహుళ ప్రైవేట్, ప్రభుత్వ అతిథి గృహాలు సైతం ఉన్నాయి. ఈ ప్రాంతం ఆకర్షణీయమైన సరస్సులు, ప్రకృతి ఉద్యానవనాలతో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
READ MORE: War 2: ట్రైలర్ తో దుల్లకొట్టేందుకు రెడీ!
అజార్ ఆఫ్ఘనిస్థాన్‌లో ఉండవచ్చని పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ లో దొరికితే అతన్ని భారతదేశానికి అప్పగిస్తామని ఆయన సూచించారు. 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 40 మందికి పైగా సైనికులను బలిగొన్న 2019 పుల్వామా దాడితో సహా భారతదేశంలో జరిగిన అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు అజార్ ప్రధాన సూత్రధారి. జైషే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోంది. అతని ప్రసంగాల పాత ఆడియో క్లిప్‌లను రీసైక్లింగ్ చేస్తూ చాలా కాలంగా బహవల్‌పూర్ స్థావరంలోనే ఉన్నాడని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. కానీ.. భారత నిఘా సంస్థలు అజార్ కదలికలను నిశితంగా గమనిస్తున్నాయి.
READ MORE: Chhangur Baba: ఛంగూర్ బాబా “రెడ్ డైరీ”లో పొలిటీషియన్స్, పోలీసుల పేర్లు..
కాగా.. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్.. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని నేలమట్టం చేసింది. భారత్ జరిపిన దాడుల్లో జైషే ప్రధాన కేంద్రం కూడా ఉంది. అంతర్జాతీయ సరిహద్దుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుబాన్‌పై భారత సైన్యం దాడి చేసింది. దీన్ని జైషే మహ్మద్‌కు ఆపరేషనల్ హెడ్ క్వార్టర్‌గా అభివర్ణిస్తారు. పుల్వామా దాడి సహా భారత్‌పై చాలా కుట్రలకు ఇక్కడే పథక రచన చేశారని చెబుతారు. ఆ భవనన్ని మసూద్ తన ఇంటిగా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా అందులోనే ఉంటున్నట్లు సమాచారం.
READ MORE: Drug Party Case: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో పబ్ యజమానలకు షాక్..
కాగా.. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిపిన దాడిలో 14 మంది మృతిచెందారు. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులే. మసూద్ అజార్ సోదరి – ఆమె భర్త, మసూద్ మేనల్లుడు – అతడి భార్య, మేనకోడలు, ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈమేరకు జైషే వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు కూడా నలుగురు మరణించారు.
