ఈ వరల్డ్ లోనే అత్యంత ఖరీదైన కారు ఏది అంటే మనకు వెంటనే అందరికి గుర్తుకు వచ్చే పేరు రోల్స్ రాయిస్. అయితే, ఈ బ్రాండ్ కార్లు ప్రారంభ ధరలే కోట్ల రూపాయల్లో ఉంటాయి. కాగా గరిష్ట ధరలు ఏకంగా 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి అత్యంత ఖరీదైన కారు దుబాయ్ రోడ్ల మీద మొదటిసారి కనువిందు చేసింది. రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ పేరుతో ఈ కారు అందుబాటులో ఉంది. అయితే, ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కావడం గమనార్హం. ఇప్పటికే బెయోన్స్ అండ్ జే జెడ్ ఈ కారుని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: TS Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు
అయితే, నిజానికి ఈ కారుని ఆవిష్కరించిన తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కనిపించడం ఇదే తొలిసారి. కాగా కంపెనీ ఇప్పటి వరకు ఈ కార్లను కేవలం మూడు యూనిట్లను మాత్రమే రిలీజ్ చేసింది. నిజానికి ఈ కారు ధర 28 మిలియన్ డాలర్లు.. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు రూ. 220 కోట్ల కంటే ఎక్కువ అన్నమాట.
Read Also: TS High Court: నేడు తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం
రోల్స్ రాయిస్ బోట్ టెయిల్ బ్రాండ్ మోడల్స్ కంటే కూడా ఇది చాలా బిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఉండే ఫీచర్స్ దాదాపు ఇప్పటివరకు ఇతర ఏ లగ్జరీ కార్లలోనూ ఉండకపోవడం విశేషం. కావున దీనిని కంపెనీ స్పెషల్ కారు అని కూడా పిలుస్తారు. ఈ కారు డిజైన్ చూడగానే అందరినీ ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇందులో చెప్పుకోదగ్గ మరో ఫీచర్ వెనుక భాగంలో కనిపించే కాక్టెయిల్ స్టోర్.. ఇందులో అవసరమైన డ్రింక్స్ స్టోర్ చేసుకోవచ్చు.. దీంతో పాటు కంప్ర్టిబుల్ టేబుల్స్, కుర్చీలు వంటివి కూడా ఉంటాయి.