NTV Telugu Site icon

R Ashwin 5 Wicket Hauls: అట్లుంటది మరి అశ్విన్‌తో.. టాప్ జట్లనే వణికించేశాడు!

Ashwin Test Wicket

Ashwin Test Wicket

R Ashwin picked up Most 5-wicket haul in Tests vs Australia: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాష్ తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఆఫ్ స్పిన్, క్యారమ్ బాల్స్ వేసి స్టార్ ఆటగాళ్లను కూడా సునాయాసంగా ఔట్ చేస్తుంటాడు. టీ20, వన్డే, టెస్ట్.. ఫార్మాట్ ఏదైనా అశ్విన్ వికెట్ల వేట కొనసాగుతూనే ఉంటుంది. ఒక దశాబ్ద కాలంగా భారత జట్టుకు అద్భుత విజయాలు అందిస్తూనే ఉన్నాడు. 36 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ అశ్విన్‌ బౌలింగ్‌లో ఏమాత్రం పదును తగ్గలేదు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ పడగొట్టాడు.

టెస్టు క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది 33వ సారి. ఇవన్నీ చిన్న జట్లపై వచ్చినవి అనుకుంటే పొరబడినట్టే. టాప్ జట్లపైనే అశ్విన్‌ 5 వికెట్స్ పడగొట్టాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక లాంటి టాప్ జట్లను యాష్ వణికించాడు. గత కొన్నాళ్లుగా ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్న ఆస్ట్రేలియాపై అశ్విన్ అత్యధిక సార్లు (7) ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు. ఆసీస్ బ్యాటర్లనే వణికించాడంటే.. యాష్ బౌలింగ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

రవిచంద్రన్ అశ్విన్‌ అత్యధిక సార్లు ఆస్ట్రేలియాపై ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు. ఆపై ఇంగ్లండ్, న్యూజీలాండ్ జట్లపై 6 సార్లు ఫైవ్ వికెట్ హాల్ తీశాడు. వెస్టిండీస్, శ్రీలంక జట్లపై 6 సార్లు ఫైవ్ వికెట్ హాల్ పడగొట్టాడు. శ్రీలంకపై 3, బాంగ్లాదేశ్ జట్లపై ఒకసారి అశ్విన్ 5 వికెట్స్ పడగొట్టాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో అనిల్‌ కుంబ్లే (953), హర్భజన్‌ సింగ్‌ (707) ఉన్నారు.

Also Read: Amazon Prime Day Sale 2023: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2023.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్!

Also Read: Amazon Prime Day Sale 2023: ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’.. ఈ క్రెడిట్ కార్డుపై భారీ క్యాష్‌బ్యాక్!